ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 10 జూలై 2022న ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సహజ వ్యవసాయ సదస్సులో ప్రసంగించనున్నారు . ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, 2022 మార్చిలో జరిగిన గుజరాత్ పంచాయితీ మహాసమ్మేళన్‌లో ప్రధాని తన ప్రసంగంలో ప్రతి గ్రామంలో కనీసం 75 మంది రైతులను సహజ వ్యవసాయాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు .
ప్రధాన మంత్రి యొక్క ఈ దార్శనికతతో మార్గనిర్దేశం చేయబడిన సూరత్ జిల్లా, జిల్లాలోని రైతు సంఘాలు, ఎన్నికైన ప్రతినిధులు,వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (APMCలు), సహకార సంఘాలు, బ్యాంకులు మొదలైన వివిధ వాటాదారులను మరియు సంస్థలను చైతన్యవంతం చేయడానికి మరియు ప్రేరేపించడానికి వ్యవసాయ అధికారులు ఒక సమిష్టి మరియు సమన్వయ ప్రయత్నాన్నిచేపట్టారు .
సహజ వ్యవసాయాన్ని అనుసరించడంలో రైతులకు సహాయం చేయడానికి , ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 75 మంది రైతులను సహజ వ్యవసాయం చేసేందుకు ప్రేరణ మరియు శిక్షణ ఇచ్చారు. రైతులను 90 క్లస్టర్లుగా విభజించి జిల్లా వ్యాప్తంగా 41,000 మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారు.
శుభవార్త :వంటనూనె లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం
గుజరాత్‌లోని సూరత్ లో ని రైతులతో ఈ సమ్మేళనం నిర్వహించబడుతోంది మరియు సూరత్‌లో సహజ వ్యవసాయాన్ని అవలంబించిన వేలాది మంది రైతులు మరియు ఇతర వాటాదారులందరూ ఈ సదస్సులో పాలుపంచుకోనున్నారు అదేవిదం గ ఈ సమావేశానికి గుజరాత్ గవర్నర్ మరియు గుజరాత్ ముఖ్య మంత్రి పాల్గొననున్నారు.
Share your comments