News

పత్తి కట్టెలను కాలుస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?

KJ Staff
KJ Staff

సాధారణంగా రైతులు సాగు చేసే పంటలు పత్తి కూడా ప్రధానమైన పంట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. ఈ విధంగా పత్తి సాగు పూర్తయిన తర్వాత రైతులు పత్తి కట్టెలను కాలుస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్క రైతు ఇదే పద్ధతిలో పత్తి కట్టలను కాలుస్తున్నారు. అయితే ఈ విధంగా పత్తి కట్టెలను కాల్చటం వల్ల రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని.

పత్తి కట్టెలను తగలబెట్టడంతో భూమిలోని సారం దెబ్బతింటుంది. అదేవిధంగా భూమిలో మనకు పంటకు మేలు కలిగించే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు చనిపోతాయి. అలాగే ఈ కట్టెలను కాల్చడం వల్ల అధిక పొగ కారణంగా వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుంది. పత్తి పంట పూర్తిచేసిన తర్వాత ఆ కట్టెలను తొలగించడానికి రైతులు అదనంగా మరి కొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. దీంతో రైతుల పై మరింత భారం పడనుంది.

ఈ విధంగా మన రాష్ట్రాలలో పత్తి కట్టెలను కాల్చి ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటే మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మాత్రం రైతులు కట్టెను ప్యాకింగ్‌ మెటీరియల్‌, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగిస్తున్నారు. దీని ద్వారా రైతులకు శ్రమ తగ్గడంతోపాటు అధిక ఆదాయం లభిస్తుంది. మహారాష్ట్రలు ఈ విధంగా ఎండిపోయిన పత్తి కట్టెలతో
పార్టికల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కర్రుగేటెడ్‌ బోర్డులు, బాక్సులు, పేపర్‌ పల్ప్‌, ప్యాకింగ్‌ బాక్సులు తయారు చేస్తున్నారు.

ఈ విధంగా తొలగించిన పత్తి కట్టేలకు కొన్ని ఫ్యాక్టరీ యజమానులు ఒక టన్ను పత్తి కట్టేలకు 300 నుంచి 400 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హెక్టారు కు సుమారు నాలుగు టన్నుల వరకు పత్తి కట్టెలు లభ్యమవుతాయి. దీంతో ప్రతి హెక్టారుకు పత్తి రైతులు సుమారుగా 12 నుంచి 16 వందల వరకు లాభం పొందవచ్చు.ఒక పత్తికర్రలో 68 శాతం హోలో సెల్యులోజ్‌, 26 శాతం లిగ్నిన్‌, 7 శాతం బూడిద లభ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ వెల్లడించింది.ఈ విధంగా ప్రతి కట్టెలను సరైన మార్గంలో ఉపయోగించుకోవడం వల్ల రైతులు మరింత లాభం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on News

More