News

PUNJAB NATIONAL BANK :కేవలం ఆధార్ మరియు మొబైల్ నంబర్‌తో సులభంగా 8 లక్షల రుణం

S Vinay
S Vinay

కేవలం ఆధార్, మొబైల్ నంబర్ మాత్రమే నమోదు చేసి ప్రభుత్వ రంగ బ్యాంకు punjab National bank (PNB) లో 8 లక్షల వరకు రుణాన్ని పొందేలా వినియోగదారుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ పథకానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్‌స్టా లోన్ అని పేరు పెట్టింది. ఈ పథకం కింద 8 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు వినియోగదారులు ఈ రుణం పొందాలనుకుంటే వారు తన మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా రుణం పొందగలరు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ పరిచింది . పంజాబ్ నేషనల్ బ్యాంకు వినియోగదారులు PNB ONE ప్రాసెసర్ ద్వారా ఈ లోన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 18001808888కి కాల్ చేయడం ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు మాత్రమే ఈ పథకం కింద రుణం పొందేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా క్షణాల్లో ఋణం పొందాలనుకునే వినియోగదారులు ఇక్కడ పొందు పరిచిన లింక్ https://instaloans.pnbindia.in/personal-loan/verify-customer#! ద్వారా దరఖాస్తు చేసుకోండి. అయితే ఈ దరకాస్తు చేసుకున్న తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు తరపు నుండి పరిగణించబడుతుంది మరియు తగిన రుణం జారీ చేయబడుతుంది.

మరిన్ని చదవండి.

YSR RYTHU BHAROSA:AP రైతులకి శుభవార్త వైస్సార్ రైతు భరోసా కింద త్వరలోనే మొదటి విడత

Share your comments

Subscribe Magazine

More on News

More