వానాకాలం పంట సమయం ముగిసింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రైతులు దాదాపు 20 లక్షల ఎకరాలలో వరి సాగు కూడా పూర్తయింది . మరోవైపు యాసంగిలో దాదాపు 50 లక్షల ఎకరాలలో పంట సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేస్తుంది .
ఈ వానాకాలం సీజన్ లో వడ్ల కొనుగోళ్లు పై శనివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వానాకాలం వడ్ల కొనుగోళ్లపై అధికారులతో సమీక్షా నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ వ్యాప్తముగా 64.3 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు .. ఈపాటికి ఎవరైనా రైతులు మిగిలిపోయి ఉంటే ఈ నెల 24 వరకు ధాన్యం కొంటామని వెల్లడించారు .
"గత సంవత్సరం అక్టోబర్ 21న వడ్ల కొనుగోళ్లు ప్రారంభించాం. 94 రోజుల పాటు కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తం గా 7,024 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,570కోట్ల విలువైన వడ్లను కొన్నం. అందులో రూ.12,700 కోట్లు రైతులకు చెల్లించాం. మరో రూ.870 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ రైతులకు వారంలో చెల్లిస్తాం" అని తెలిపారు .
ఉత్తమ వరి రకాలు ... ఖరీఫ్ మరియు రబీలో సాగుకు అనుకూలమైన వరి రకాలు ..
అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగిన జిల్లాలు :
నిజామాబాద్ లో 5.86 లక్షల టన్నులు
కామారెడ్డిలో 4.75 లక్షల టన్నులు
నల్గొండలో 4.13 లక్షల టన్నులు
మెదక్ లో 3.95 లక్షల టన్నులు
జగిత్యాలలో 3.79 లక్షల టన్నుల
అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 2,264 టన్నులు
మేడ్చల్లో 14,361 టన్నులు
ఆసిఫాబాద్లో 21,548 టన్నులు
రంగారెడ్డిలో 22,164, టన్నులు
గద్వాలలో 24,181 టన్నులు
గత ఏడాది వానాకాలం సీజన్లో లో మొత్తం 70.44 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్లు . అంటే ఈ లెక్కన పోయినేడాదితో పోలిస్తే ఈసారి కొనుగోళ్లు భారీగా తగ్గాయి.
Share your comments