వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియవు. రైతులకు అవసరమైన సమయంలో వర్షాలు కురవవు. కరెక్ట్‌గా పంట చేతికి వచ్చే సమయంలో ఆకాల వర్షాలు పడటం వల్లన రైతులు నష్టపోతున్నారు. అందుకే రైతులు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలి. ప్రసార మాధ్యమాలు, వార్తా పత్రికలు లేదా ఇంకేదైనా సోర్స్ ద్వారా కానీ వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఆకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవచ్చు.
పొలానికి ఇవాళ పొద్దున్నే నీళ్లు పెడతారు. కానీ సాయంత్రం వర్షం పడితే పంటకు నష్టం జరుగుతోంది. అయితే ముందే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు అసలే మండు వేసవి. వర్షాలు ఎందుకు పడతాయిలే అని చాలామంది రైతులు అనుకుంటారు. కానీ ఊహించని విధంగా వర్షం పడితే రైతులు పంట నష్టపోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో తాజా వాతావరణ అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర తమిళనాడు, దానిని అనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ద్రోణీ ఏర్పడగా.. తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఊరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
దీంతో పాటు ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు,. మత్య్సకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని చెప్పారు. రైతులు ఈ విషయాన్ని ముందే తెలుసుని జాగ్రత్త పడటం మంచిది.
అటు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులు, ఉక్కబోత దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇలాంటి తరుణంలో వర్షాలు పడటం ప్రజలకు కాస్త ఊరటే అని చెప్పవచ్చు.
Share your comments