రుతుపవనాలు ఆలస్యం జులై నెల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాదిన న ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ , హర్యాన తో సహా హిమాచల్ లో గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . రానున్న ఐదు రోజులు ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ దిశ గాలుల వేగంలో మార్పు కారణంగా రెండు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. చెన్నయ్ లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన స్వల్ప వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
MFOI అవార్డు లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల !
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్టు ప్రాంత ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Share your comments