కేంద్ర ప్రభుత్వం జనపనార పండించే రైతులకు మద్దతుగా, జనపనారకు ఇచ్చే MSP పై 285 రూపాయిలు అదనంగా ఇవ్వనుంది. దేశంలో జనపనార సాగు పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, కాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సమావేశమై, జానపనారకు ఇచ్చే కనీస మద్దతు ధరపై సమీక్షా జరిపారు. ఈ సమీక్ష అనంతరం, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని MSP లో ఈ మార్పులు చేసినట్లు తెల్సుతుంది. 2024-25 సీసన్ నుండి క్వింటాల్ జనపనార ధర రూ. 5,335 గా ఉండబోతుంది. పెరిగిన ధర ద్వారా జనపనార రైతులకు ఊరట లభించినట్లయింది. MSP పెరుగుదల వల్ల రైతులకు, గిట్టుబాటు ధర లభిస్తుంది.
గత పది సంవత్సరాల నుండి జానపనారపై కనీస మద్దత్తు ధర పెరుగుతూ వస్తుంది. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,400 ఉన్న ధర క్రమేణా పెరుగుతూ ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.5,335 కు చేరుకుంది. ప్రతి సంవత్సరం, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (CACP), పెరుగుతున్న వ్యవసాయ అవసరాలను మరియు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పంటలకు కనీస మద్దత్తు ధరను సూచిస్తుంది.
పోయిన సంవత్సరం ప్రభుత్వం రికార్డు స్థాయిలో జానపనారను కోనుగోలు చేసింది. రూ. 524.32 కోట్ల వ్యయంతో మొత్తం 6.24 లక్షల బెల్స్ జానపనారను కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం జనపనార సాగు విస్తీర్ణం పెరిగింది కాబట్టి, మరింత ఎక్కువ ఉతప్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మద్దతు ధర పెరగడం ద్వారా దేశంలో జనపనార సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Share your comments