ప్రస్తుత కలలో సోసియేలా మీడియా పుణ్యమాని అనేక పుకార్లను పుట్టుకొస్తున్నాయి తాజాగా సోసియేలా మీడియాలో నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లని చెల్లవని వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా స్పందించింది.
ఇప్పటివరకు చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్లపై స్టార్ గుర్తు కనిపించడం సాధారణమే గతమో నోట్లపై ఇటువంటి గుర్తులను ప్రాజాలుఁ చూడకపోవడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన RBI స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని తేల్చి చెప్పింది. అవి చెల్లుబాటు అవుతాయనీ స్పష్టం చేసింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది.
నంబరింగ్ ప్యానెల్‌లో, ప్రిఫిక్స్, క్రమ సంఖ్య మధ్య స్టార్ గుర్తు ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్టార్ సింబల్ ఉంటే- ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా భావించాలని . పాత నోటును రీప్లేస్ చేయడమో లేక రీప్రింట్ చేసినప్పుడు దానికి గుర్తుగా ఈ స్టార్‌ను వాడుతున్నట్లు వివరణ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్.
నేడు తెలంగాణాలో కుండపోత వర్షాలు .. రెడ్ అలెర్ట్ జారీ !
గతంలో ప్రింటింగ్లో లో లోపలు ఉండటం వల్ల గతంలో జారీ చేసిన వంద బ్యాంక్ నోట్ల కట్టలను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఈ స్టార్ గుర్తును నంబరింగ్ ప్యానెల్‌లో జత చేయాల్సి వచ్చిందని పేర్కొంది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్ల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Share your comments