గతంలో 2000 వేల నోట్లు కనిపించడం లేదు అని వచ్చినా వార్తలు చివరకు రూ. 2000 నోటును రద్దు చేయడం తో ముగిసాయి ఇప్పుడు గత కొన్ని రోజులుగా RBI ప్రచురించిన రూ. 500 నోట్లు కొన్ని మాయమయ్యాయని ఒక RTI కార్యకర్త మీడియాకు వెల్లడించిన సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే దీనిపై రాత్రి RBI తన అధికారిక ఖత లో ఒక లేఖను విడుదల చేసింది.
88,032.5 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు లెక్కల్లో కనిపించడంలేదని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి . సమాచార హక్కు చట్టం క్రింద ఒక RTI కార్యకర్త సేకరించిన వివరాలను మీడియాకు వెల్లడించారు . మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి మూడు నోట్స్ ప్రిటింగ్ ప్రెస్‌ల నుంచి 375.45 మిలియన్ల 500 నోట్లు ప్రింట్ చేసినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని, ఆర్బీఐ మాత్రం 345 మిలియన్ నోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపినట్లు ఆర్టీఐ కార్యకర్త తెలిపారు.
వేల కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు లెక్కల్లో కనిపించంలేదని వచ్చిన వార్తలను ఆర్బీఐ తోసిపుచ్చింది. ప్రింటింగ్ నుంచి నోట్లన్నింటీని ఆర్బీఐ సరిగానే లెక్కించిందని తెలిపింది.
ఇది కూడా చదవండి.
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం..
ప్రింటింగ్ నుంచి వచ్చిన అన్ని నోట్లు సక్రమంగా లెక్కించి, రికార్డ్ చేసినట్లు తెలిపింది. నోట్ల ప్రింటింగ్ నుంచి ఆర్బీఐకు సరఫరా చేసే వరకు అన్నో దశల తనిఖీలు, ప్రోటోకాల్స్, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. నోట్ల నిల్వ, పంపిణీకి నియంత్రణకు ప్రోటోకాల్స్ ఉన్నాయని తెలిపింది. ఆర్బీఐ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ప్రచురిస్తున్న సమాచారాన్ని విశ్వసించాలని ఆర్బీఐ కోరింది.
ఇది కూడా చదవండి.
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం..
Share your comments