భూ రికార్డుల డిజిటలైసెషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇప్పటికి అనేక రకాల సమస్యలు ఎదురుకుంటున్నారు అయితే వేంటనే వీటిని పరిష్కరించడానికి కొత్త కొత్త భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ ఈ మేరకు చర్యలు ప్రారంభించారు.
స్వల్పంగా మొరాయిస్తున్న సమస్యలను సైతం దారికితెచ్చి ధరణి దిద్దుబాటుతో లక్ష్యం చేరాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో తలెత్తిన సమస్యలన్నీ త్వరగా పరిష్కారించాలని , ఇంకా తొలగిపోని కొన్ని సమస్యలను కరూడా రూపుమాపి సరికొత్త ధరణిని పోర్టల్ ను రూపొందించేందుకు యంత్రాంగం జోరుగా శ్రమిస్తోంది.ధరణిని దారికితెచ్చేందుకు ఉన్న పలు అవకాశాలను పరిశీలించిన ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.
కొత్త పాస్ పుస్తకాలు ఉంటేనే రిజిస్ట్రేషన్లకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే పలు కారణాలతో 6లక్షలకుపైగా ఖాతాలకు చెందిన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందలేదు. డిజిటల్ సిగ్నేజెర్ పెండింగ్, ఆధార్ సీడింగ్ కానీ భూములకు పాస్ పుస్తకాలు దక్కలేదు.
ధరణి సమస్యల పరిష్కారానికి రంగంలోకి కమిషనర్ నవీన్ మిత్తల్..
వివాదాల్లో ఉన్న ఇనాం భూములను ప్రాసెస్ చేసేందుకు, ఓఆర్‌సీలు జారీ చేసేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి.
రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మ్యుటేషన్ జరిగేలోపు పట్టాదారుడు చనిపోతే ఆ పట్టాదారువారసులకు మ్యుటేషన్ చేసే అవకాశం ఇవ్వాలి.
అసలైన పట్టాదారులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కొందరు మీసేవా కేంద్రాల ద్వారా పట్టాభూములను నాలా కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో అసలైన పట్టాదారులకు ఇబ్బంది అవుతోంది. అలాంటి థర్డ్ పార్టీ దరఖాస్తులను రద్దు చేసే ఆప్షన్ ఇవ్వాలి.
Share your comments