
ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లా యాసంగి సీజన్‌లో జొన్న సాగు చరిత్ర సృష్టించింది (Adilabad jowar cultivation record 2025). గతేడాది కేవలం 70,000 ఎకరాల్లో మాత్రమే సాగు జరగగా, ఈసారి ఏకంగా 40,000 ఎకరాలు పెరిగి మొత్తం 1.10 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగింది. ఇది జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని రికార్డు. ఈ వృద్ధితో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
దిగుబడి అంచనా (Yasangi season crop update) – 17 లక్షల క్వింటాళ్లు
జొన్న సాగు విస్తీర్ణం పెరగడంతో ఎకరానికి సగటు 15 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా మొత్తం 17 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి పేర్కొన్నారు. పత్తి పంట తర్వాత శనగ సాగు తగ్గించడంతో రైతులు ఎక్కువగా జొన్న పంటను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
కొనుగోళ్లు ప్రారంభం – మద్దతు ధర రూ.3,771 (MSP for jowar 2025)
రైతులు పంట కోత పూర్తిచేసి అమ్మకాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాలుకి రూ.3,771 మద్దతు ధరను నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బోథ్, ధన్నోర మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మిగిలిన కేంద్రాల్లో త్వరలోనే ప్రారంభించనున్నారు.
రైతులకు మద్దతుగా జిల్లా యంత్రాంగం
మంగళవారం కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే, సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాలోకి జొన్న రవాణా జరగకుండా బార్డర్ చెక్‌పోస్టుల వద్ద విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఎకరానికి గరిష్ఠ కొనుగోలు పరిమితి – రైతుల ఆందోళన
ప్రస్తుతం ఎకరానికి గరిష్ఠంగా 8.65 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 10-15 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని వారు చెబుతూ, మిగిలిన పంటను ఏమి చేయాలో తెలియక అయోమయానికి లోనవుతున్నారు. తమ పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని (jowar purchase centers Telangana) రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ప్రభుత్వం దృష్టికి నివేదిక సమర్పించినట్లు సమాచారం.

మండలాల వారీగా జొన్న సాగు వివరాలు -ఎకరాల్లో (Jowar farming Telangana 2025):
- జైనథ్ – 17,638
- బోథ్ – 11,496
- ఆదిలాబాద్ రూరల్ – 11,135
- తలమడుగు – 10,407
- తాంసి – 7,652
- బజార్హత్నూర్ – 6,699
- నేరడిగొండ – 6,564
- ఇచ్చోడ – 5,815
- ఇంద్రవెల్లి – 6,388
- ఉట్నూర్ – 6,667
- గుడిహత్నూర్ – 3,510
- భీంపూర్ – 3,419
- నార్నూర్ – 4,075
- సిరికొండ – 1,754
- గాదిగూడ – 1,539
- మావల – 705
- ఆదిలాబాద్ అర్బన్ – 181
రైతుల కష్టాన్ని గుర్తించి పూర్తి దిగుబడి కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రైతుల డిమాండ్ స్పష్టంగా వినిపిస్తుంది. యాసంగి సీజన్‌లో ఆదిలాబాద్ జిల్లా జొన్న సాగు రికార్డు స్థాయికి చేరడంతో, ప్రభుత్వ సహకారం (Telangana farmer schemes) సమర్థంగా ఉంటే ఇది ఒక ఆర్థిక విజయం గానే కాక, సుస్థిర సాగుకు దారితీయవచ్చు.
Read More:
Share your comments