ఎన్నికలు సమీపిస్తుండడంతో లబ్దిదారులకు సంక్షమే పథకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తుంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మత్స్యకార భరోసా పథకం ఐదో విడత నిధులను విడుదల చేసింది.
మత్స్యకార భరోసా పథకం కింద ప్రభుత్వం సముద్రంలో వేటకు వెళ్లే వారి కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి కూడా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. అదేవిధంగా ఈ పథకం కింద మత్య కారుల ప్రయోజనకోసం ఆర్థిక సాయం అందిస్తుంది . మత్స్య కారులకు డీజిల్ పై సబ్సిడీ గ లీటరుకు రూ . 9 వరకు సబ్సిడీ ను అందిస్తుంది , గతంలో లీటరుకు రూ . 6 వున్నా సబ్సిడీ ని ఇప్పుడు ప్రభుత్వం రూ . 9 కు పెంచింది . దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 81 డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించింది. వీటి ద్వారా లబ్దిదారులకు డీజిల్ పై సబ్సిడీ అందిస్తుంది . ఈ పథకం 18-60 సంవత్సరాల వయస్సు కల్గిన మత్య కారులకు వర్తిస్తుంది . వేటకు వెళ్లి ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఈ పథకం క్రింద రూ . 10 లక్షల బీమాను కూడా అందిస్తుంది .
ఇది కూడా చదవండి .
రేషన్ కార్డు లబ్దిదారులకు చివరి అవకాశం: రేషన్ - ఆధార్ లింక్ చేయకుంటే కార్డు కట్ !
సీఎం జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను మంగళవారం మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేసారు .
Share your comments