News

" 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఎదురుదెబ్బ": నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్

Srikanth B
Srikanth B

వ్యవసాయ రంగానికి సంస్కరణలు అవసరమని  నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సాగుదారులు అధిక ధరలను సాధించడానికి 'ఎదురుదెబ్బ'గా మారిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించడంలో ఈ 3 వ్యవసాయ చట్టాలు దోహదం చేస్తాయని అయన  అన్నారు.

వ్యవసాయ సంస్కరణ ప్రక్రియను పునఃప్రారంభించేందుకు రాష్ట్రాలతో తాజా సంప్రదింపులు ప్రారంభించాలని ఆయన సూచించారు, సంస్కరణలను అమలు చేయాలనే పిలుపుతో కొంతమంది ఇప్పటికే నీతి ఆయోగ్ ను సంప్రదించారని ఆయన అన్నారు. "వ్యవసాయ రంగానికి సంస్కరణలు చాలా ముఖ్యం. కొంతమంది రైతులు దీనిని (మూడు వ్యవసాయ చట్టాలు) వ్యతిరేకించారు... రాష్ట్రాలతో తాజా సంప్రదింపులను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను" అని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ తెలిపారు .

"ఇప్పటికే ప్రజలు సంస్కరణలు అవసరమని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కానీ  ఈ  సంస్కరణలు అమలు కావాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

ఇప్పటికే ప్రజలు సంస్కరణలు అవసరమని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కానీ  ఈ  సంస్కరణలు అమలు కావాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో బిజెపి విజయం సాధించిన తరువాత భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కోసం నిలిచిపోయిన సంస్కరణలు మరొక ఊపును పొందుతాయా అనే ప్రశ్నకు చంద్ సమాధానమిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయకుండా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించగా, రైతులు మంచి ధరలను పొందడానికి సంస్కరణలు అవసరమని, కాబట్టి సంస్కరణలు జరగకపోతే, ఇది ఖచ్చితంగా రైతులు అధిక ధరల సాధనకు ఎదురుదెబ్బ అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి .

"వరి పండించిన రైతులు రూ.3 వేల కోట్లు నష్టపోతారు"-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More