రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీరేట్లను పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపో రేటు (Repo Rate)ను పెంచుతున్నట్లు ప్రకటించింది.మానిటరీ పాలసీ కమిటీ బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 50 bps పెంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేసిందని ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 5.7 శాతం నుండి 6.7 శాతానికి పెంచింది.రెపో రేటు (Repo Rate)ను గత నెలలోనే 40 బేసిస్ పాయింట్లకు పెంచగా, తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. ఫలితంగా ప్రస్తుతం రెపో రేటు (Repo Rate) 4.90 శాతానికి చేరింది.
అసలు రెపో రేటు అంటే ఏమిటి?
కొన్ని క్లిష్ట సమయాల్లో రుణాలిచ్చే బ్యాంకుల వద్ద కూడా నిధుల కొరత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులు ఆర్థిక సహాయం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయిస్తాయి. ఈ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ నుంచి నగదును తీసుకుంటాయి. ఈ నగదుపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటును "రెపో రేటు (Repo Rate)" అంటారు.
అయితే ద్రవ్యోల్బణం (Inflation) పెరగడానికి కారణం వస్తువుల మరియు ముడి చమురు ధరలే కారణం. టమాటా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా వీటికి ఆజ్యం పోసింది. 2022లో ఇప్పటివరకు 45 దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ఆస్ట్రేలియా బ్యాంకు వడ్డీరేట్లను 2 శాతం పెంచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి మూడు త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉండవచ్చు అని RBI గవర్నర్ వెల్లడించారు.
RBI రేట్ల పెంపుతో EMIలు మరింతగా పెరగడం ఖాయం:
RBI విధించిన కొత్త వడ్డీ రేట్ల వలన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ప్రధానంగా గృహ రుణాలు పొందే వారికి EMI భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ ఉండనప్పటికీ EMI లు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగనుంది.
మరిన్ని చదవండి.
Share your comments