ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానున్న వారాహి యాత్రకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. వారాహి యాత్రకు సంబంధించి అన్ని పనులకు పవన్ కళ్యాణ్ పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ యాత్ర అన్నవరంలో ప్రారంభమయ్యి రెండు గోదావరి జిల్లాలకు సాగనుంది. ప్రభుత్వం ఈ యాత్రకు సంబంధించి పోలీసులకు అలెర్ట్ చేసింది.
ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అమలాపురంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని అమలు చేస్తూ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలియజేసారు. ఈయాక్ట్ అమల్లో ఉన్నన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో ఎవరు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, వపన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14 నుండి 28 వరకు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జరగనుంది, అయితే ఈ కార్యక్రమంపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా మూడు నెలల క్రితమే సెక్షన్ 30ని ఎత్తివేయడంతో అమలాపురంలో సెక్షన్ 30ని హఠాత్తుగా అమలు చేయడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త: రేపటి నుండే 'జగనన్న విద్యా కానుక'..
కొత్తపేట పోలీస్ డివిజన్ పరిధిలోని రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, సఖినేటిపల్లి మల్కిపురం సహా అన్ని ప్రాంతాల్లో ఈ సెక్షన్ 30 అమలులో ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14 నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఐదు బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 14న ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్‌లో తొలి సభ, పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో 16న, 18న కాకినాడ సర్పవరం జంక్షన్, అమలాపురం గడియార స్థంభం సెంటర్ లో 21న , 22న రాజోలు మల్కిపురం సెంటర్‌లో నిర్వహించనున్నట్లు జనసేన నేతలు తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments