News

రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా

Srikanth B
Srikanth B
రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా
రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా

 

తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి , ఇంకా కొన్ని నెలలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ..రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల డిక్లరేషన్లను ప్రకటించుకుంటూ పోతుంది ఇప్పటికే రైతులను అక్కటుకునేలా వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు 2 లక్షల రుణమాఫీ తో పటు రైతులకు ఇప్పడి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ను పదివేల నుంచి 15 పదిహేను వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.

ఈహామీలే లక్ష్యముగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం అవుతుంది . గతేడాది మేలో రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద సొంత భూమి కలిగినవారితో పాటు కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం అన్ని ప్రకటించింది.

తెలంగాణాలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేసుకున్న భూమి లేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తాం'' అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కౌలు రైతులకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి రైతుబంధు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం. అందడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.

తెలంగాణాలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

Related Topics

raithu bharosa

Share your comments

Subscribe Magazine

More on News

More