News

పెరుగుతున్న పప్పు ధరలు .. కిలో రూ.200 చేరే అవకాశం !

Srikanth B
Srikanth B
పెరుగుతున్న పప్పు ధరలు .. కిలో రూ.200 చేరే అవకాశం ! Image credit : refreshyourlife
పెరుగుతున్న పప్పు ధరలు .. కిలో రూ.200 చేరే అవకాశం ! Image credit : refreshyourlife

పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు పెరుగుతున్న పప్పు ధరలు మరింత భారం పడే అవకాశం కనిపిస్తున్నది .గత నెల రోజులలుగా పప్పు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో రానున్న రోజులలో పప్పు ధరలు మరింత పెరిగి సామాన్యుడి జెబ్బుకు చిల్లులు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .

 

ఒకవైపు నూనె ధరలు తగ్గుతాయన్న ఆశభావం తో ఉన్న ప్రజలకు పెరగనున్న ధరలు మరింత భారం కానున్నాయి .

పప్పులు సాధారణంగా భారతీయ వంటకాల్లో అత్యంత ప్రధానమైనవి. ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ప్రోటీలనుంచి మొదలుకొని అనేక పోషకాలు కల్గి వుండే పప్పు దినుసులు సామాన్య ప్రజల యొక్క ప్రధాన వంటకము దీనితో చాలా మంది వీటిపై ఎక్కువ ఖర్చు చేస్తారు.

రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో పప్పు రూ.95-110కి విక్రయించగా, ప్రస్తుతం కిలో రూ.130-150 వరకు విక్రయిస్తున్నారు. ఎర్ర పప్పు కూడా గత నెలలో కిలో రూ.70 ఉండగా, కిలో రూ.100పైగా పెరిగింది. అలాగే ఇతర పప్పు ధరలు కూడా కిలో రూ.130 మార్కును దాటాయి.

గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లో రూ.25 వేలు జమ చేయనున్న ప్రభుత్వం..

ప్రతి నెలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి ఇష్టపడే కస్టమర్లు కూడా ధరల పెంపును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆన్‌లైన్‌లో పప్పు కిలో రూ. 137-160కి లభిస్తుండగా, అదే ఆర్గానిక్ వెర్షన్ కిలో రూ. 200-250కి లభిస్తుంది. ముఖ్యంగా పప్పు ధరలు బాగా పెరగడం, ద్రవ్యోల్బణం పరిస్థితిని అద్దం పడుతున్నాయి .

ఏదిఏమైనప్పటికీ పెరగనున్న పప్పు ధరలు సామాన్యులకు పెనుభారం కానున్నాయి .

గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లో రూ.25 వేలు జమ చేయనున్న ప్రభుత్వం..

Related Topics

oilprice

Share your comments

Subscribe Magazine

More on News

More