మార్కెట్లో లభ్యత ఉన్న తక్కువ గుర్తింపు ఉన్న కూరగాయలకి గుర్తింపు తెచ్చి, వాటి ఉపయోగాలు ప్రజలకు తెలియపరిచేందుకు కృషి జాగరణ్ తన వంతు కృషి చేస్తుంది. తక్కువ గుర్తింపు ఉన్న కూరగాయలకు గిరాకీ పెంచాలన్న ఆలోచన వచ్చిన కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్, ఈ ఆలోచనను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ముల్లంగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది అయినప్పటికీ మార్కెట్లో దానికి తగ్గ గిరాకీ లేకపోవడం బాధాకరం. రైతులు కూడా మంచి లాభం రాదు అనే ఆలచనతో ముల్లంగి సాగును నిలక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మర్చి ప్రజల్లో ముల్లంగి ఉపయోగాల పట్ల చైతన్యం తెచ్చేందుకు కృషి జాగరణ్ పని చేస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ 5, 2024న రుటీన్ ఫర్ రాడిష్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో, ముల్లంగి ఉపయోగాలు, ఉత్పాదకత, మార్కెటింగ్, మొదలగు అంశాల మీద పలువురు నిపుణులు ప్రసంగించారు. మహీంద్రా ట్రాక్టర్స్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో సోమని సీడ్స్ అభివృద్ధి చేసిన HY Radish X-35 హైబ్రిడ్ రకం ముళ్ళగి గురించి చర్చించడం జరిగింది.
రుటీన్ ఫర్ రాడిష్:
కృషి జాగరణ్ వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సోమని సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ సోమని, CHAI వ్యవస్థాపకులు మరియు చైర్మన్, డా. హెచ్ పి సింగ్, హార్టికల్చర్ కమీషనర్ ప్రభాత్ కుమార్, హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డా. సుధాకర్ పాండే, IARI వెజిటల్ సైన్సెస్, హెచ్ఓడి డా. బి.ఎస్ తోమర్, ఐహెచ్ఎం డైరెక్టర్ డా. కమల్ పంత్, PUSA ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ డా. నూతన కౌశిక్, డా. పికె. పంత్ కృషి జాగరణ్ COO మరియు ముల్లంగి పండిస్తున్న రైతులు నిర్దేష్ కుమార్ వర్మన్, ఉత్తర్ ప్రదేశ్ హాపూర్, తారాచంద్ కుష్వాహా, ఆగ్రా ఉత్తర్ ప్రదేశ్, సందీప్ సైని, ఉత్తర్ ప్రదేశ్ హాపూర్, ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్:
కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు ఎం. సి. డొమినిక్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరిని సగౌరవంగా ఆహ్వానించారు. మార్కెట్లో తక్కువ విలువ ఉన్న ఆహార పదార్ధాలకు గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యాక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సరం చిరుధాన్యాలకు పంటలకు ప్రాధాన్యత కల్పించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం నుండి ప్రేరణ పొంది, ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు అయన తెలిపారు. మిగిలిన కూరగాయ పంటల సాగుతో పోలిస్తే ముల్లంగి సాగులో నష్టం తలెత్తే అవకాశం తక్కువని అయన ప్రస్తావించారు. అలాగే కేరళలో ఒకప్పుడు పనసపళ్లకు అంతటి ప్రత్యేకత ఉండేదికాదని, కాలానుక్రమంగా వీటికి ప్రజల్లో ఆదరణ పెరగడం మూలాన ఇప్పుడు రైతులు వీటిని వాణిజ్య పంటగా పండిస్తున్నారని అదే విధంగా ముల్లంగికి కూడా ప్రజాధారణ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏడాది నుండి కృషి జాగరణ్ అందించే MFOI అవార్డుల క్యాటగిరీలలో ముల్లంగి రైతులను కూడా చేరుస్తున్నట్లు, సోమని సీడ్స్ ఈ కేటగిరీ అవార్డులకు సహకారం అందిస్తునందుకు కృతజ్జతలు తెలిపారు.
డా ప్రభాత్ కుమార్, కమీషనర్ ఆఫ్ హార్టికల్చర్:
వ్యవసాయంలో వస్తున్న నూతన విధానాల ద్వారా ముల్లంగిని ప్రస్తుతం సంవత్సరం మొత్తం పండిస్తున్నాం అని తెలిపారు. ముఖ్యంగా ఈ పంటను సాగుచేస్తూ మంచి దిగుబడి పొందుతున్న రైతులను ఈ కార్యాక్రమానికి ఆహ్వానించడం ఆయనకు సొంతోషం కలిగిస్తుందన్నారు. ముల్లంగిని అంతరపంటగా కూడా పండించని తద్వారా రైతులు రైతులు తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. కూరగాయల పంటలు పండించే రైతులు, రసాయన మందుల వినియోగం తగ్గించి, సుస్థిర వ్యవసాయంవైపు మొగ్గు చూపాలని కోరారు.
కమల్ సోమని, సోమని సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్:
ఒకప్పుడు ముల్లంగిని నిర్లక్ష్యం చేసారు, కానీ ఇప్పుడు దాని విలువ గ్రహించిన రైతులు ముల్లంగి సాగు చేపడుతున్నారని కమల్ సోమని సంతోషం వ్యక్తం చేసారు. ముఖ్యంగా తక్కువ భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులకు ముల్లంగి ఒక అద్భుతమైన పంటని, పంట నాటిన 40 రోజుల్లోనే దిగుబడి పొందేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు. తక్కువ సమయంలో పంటా చేతికి రావడం వలన సంవత్సరానికి రెండు, మూడు పంటలు సాగుచేయచ్చన్నారు. పైగా ముల్లంగి సాగుకు అయ్యే ఖర్చు కూడా తక్కువ గనుక రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
డా. హెచ్ పి సింగ్, ఫౌండర్ & డైరెక్టర్ CHAI:
సృష్టిలో ఏది తక్కువ కాదని, మనసు పెట్టి చూస్తే అన్నింటి నుండి అద్భుతాలు సృష్టించవచ్చని, ముల్లంగి సాగు సులభమైనప్పటికీ, దీని పండించడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని ఆయన ప్రస్తావించారు. కానీ ముల్లంగిని విక్రయించడంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే నష్టాలపాలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఏవైనా కొత్త పంటలు రైతుల ముందుకు తీసుకువెళ్లే ముందు అనేక కోణాల్లో ఆలోచించాలన్నారు.
డా. సుధాకర్ పాండే, అడిషనల్ డైరెక్టర్ జనరల్ హార్టికల్చర్:
ముల్లంగి తక్కువ సమయంలోనే పరిపక్వము చెంది 40-60 రోజుల్లో పంట చేతికి వస్తుందన్నారు. ముల్లంగి సాగు చేసే రైతులందరు లక్షాధికారి రైతులు అవ్వచ్చని, కానీ పంట నాటే సమయం, మరియు మార్కెట్లో దీని విలువ ఎంత ఉంటుంది అనే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని రైతులకు సూచించారు.
డా. నూతన కౌశిక్, డైరెక్టర్ జెనరల్, ఫుడ్ & అగ్రికల్చర్ ఫౌండేషన్ , అమిటీ యూనివర్సిటీ:
వ్యవసాయంలో ఉపయోగించే మెళుకువలు అన్ని మంచి దిగుబడిని ఇస్తాయి కానీ, ఉత్పత్తిని సరిగ్గ విక్రయించడంలోనే మనకు వచ్చే లాభం ఉంటుందని అయన మాట్లాడారు, ముల్లంగిలో కూడా దిగుబడికి తగ్గట్టు సరైన సమయంలో మార్కెట్లో విక్రయించగలిగితే మంచి లాభాలు పొందవచ్చని ఆయన తెలిపారు.
డా. కమల్ పంత్, డైరెక్టర్, ఐహెచ్ఎం PUSA:
ముల్లంగి వంటి పంటలను నేరుగా మార్కెట్లో విక్రయించడంతో పాటు, పచ్చళ్ళగాను, మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ గా అమ్మితే ఎక్కువ లాభాలు పొందవచ్చని అయన తెలిపారు, చాల ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ముల్లంగిని కిమ్చి అనే నిల్వ చెయ్యగలిగే పికిల్ లాగా తయారుచేసి అమ్మి మంచి లాభాలు పొందుతున్నారన్నారు.
డా.బిఎస్ తోమర్, హెచ్ఓడి IARI:
డా. తోమర్ ముల్లంగిలో దొరికే రకాల గురించి ప్రస్తావించారు. సాధారణంగా మార్కెట్లో మనం, తెలుపు రంగు ముల్లంగిని చూస్తాం, కానీ ముల్లంగిలో ఎరుపు, నీలం, నలుపు రంగుల్లో ముల్లంగిని చూడవచ్చని అయన తెలిపారు.
రుటీన్ రాడిష్ కార్యక్రమం ద్వారా, ప్రజల్లో మరియు రైతుల్లో చైత్యనం పెరిగి ముల్లంగికి ప్రాముఖ్యం పెరుగుతుందని, కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్ నమ్ముతున్నారు. చివరిగా కృషి జాగరణ్ సిఓఓ డా.పి కే. పంత్ విచ్చేసిన అతిధులకు రైతు మిత్రులకు ధన్యవాదాలు తెలిపి ఈ కార్యక్రమం ముగించారు.
Share your comments