News

సన్నాలకు మద్దతు ధర మించి రూ.400 అదనం..

Gokavarapu siva
Gokavarapu siva

నల్గొండ జిల్లాలో వరి విషయంలో భిన్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వరికి అధిక ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర అనగా (ఎంఎ్‌సపీ) రూ. 2,060 ను రైతులకు చెల్లిస్తుంది. మిల్లర్లు ఈ మద్దతు ధరకు మించి రూ. 400ను రైతులకు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి సన్నలను పండించిన రైతులు అధిక ధరపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా మిల్లర్లు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లే ఈ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా హెచ్‌ఎంటీ, చింట్లు, జైశ్రీరాం వంటి సన్నాలకు మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాకు చెందిన మిల్లర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.

జాతీయంగా మరియు అంతర్జాతీయంగా సన్నలకు భారీగా డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా ఐతే ఎక్కువగా సౌదీ దేశాలనుండి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీటిని గమనించిన మిల్లర్లు ఆయా దేశాల్లో కార్యాలయాలను ప్రారంభించి, అక్కడ డిమాండ్ కు అనుకుగుణంగా రాష్ట్రంలో సన్నల రకం బియ్యాన్ని సేకరిస్తున్నారు. దీనికొరకు మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తున్నారు. దేశంలో ఐతే తమిళనాడు, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సన్నాలు భారీగా డిమాండ్ పెరిగింది.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..

ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో దొడ్డు రకాలు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఈ కేంద్రాలను ఈ నెల 15 నుండి ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానికై చర్యలు తీసుకుంటున్న దాఖలే లేవు అని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు సన్నాలకు రూ.400 అదనంగా చెల్లిస్తుంటే, దొడ్డు రకాలకు మాత్రం రూ.400 కోత పెడుతున్నారని రైతులు తెలియజేస్తున్నారు. అంటే క్వింటా దొడ్డు రకం బియ్యానికి రూ.1650 మిల్లర్లు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల కోతలు ప్రారంభమయ్యాయి, ఈ విషయంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిల్లర్లు డిమాండ్ కు తగ్గట్టుగా నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నారు. ఒక్కో మిల్లర్‌ వద్ద ప్రస్తుతం రోజుకు సగటున రెండువేల బస్తాల ధాన్యాన్ని పట్టే అవకాశం ఉండగా అదనపు ప్లాంట్లను ఏర్పాటు చేసి రెట్టింపు ఔట్‌పుట్‌కు ప్రయత్నిస్తున్నారు. మిల్లర్లు వారి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకుని రోజుకు అదనంగా లక్ష బస్తాల ధాన్యాన్ని మారుస్తున్నారు.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..

Related Topics

rice crop MSP

Share your comments

Subscribe Magazine

More on News

More