రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నుంచే సన్నా లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెడతామని గురువారం ప్రకటించారు .
గురువారం సెక్రటేరియె ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రైతులకు శుభవార్త పీఎం కిసాన్ విడుదల తేదీని ప్రకటించిన ప్రభుత్వం
ఈ ఏడాది రాష్ట్రంలో 58% వరి సన్న రకాలు సాగయ్యాయని సీఎం చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వచ్చే ఏడాది నుంచి దిగుబడులు పెరగవచ్చని ఆయన ఆశించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో పూర్తిగా సన్న వడ్లు పండించే రోజులు రానున్నాయి. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో, ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహిస్తోంది. వచ్చే జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ సంవత్సరం 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో, ట్రేడర్లు, మిల్లర్లు, మరియు రైతులు తమ అవసరాలకు నిల్వ చేసుకున్న ధాన్యం వదిలితే, 91 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు ఉంటాయి. మిల్లర్లకు ఇచ్చే ధాన్యం విషయంలో కలెక్టర్లు నిబంధనలు పాటించాలని సూచించారు. డీఫాల్ట్ లేని మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని చెప్పారు.
Share your comments