నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మందాజీ నర్సింహాచార్య ఇన్‌స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ అనే పరికరాన్ని కనిపెట్టాడు.
గ్రామీణ శాస్త్రవేత్త మందాజీ నరసింహా చారి పాడైపోయిన ట్యూబ్ లైట్లను మళ్లీ ఉపయోగించుకునే పద్దతిని కనిపెట్టారు. దీనికి సంబంధించి అతను పేటెంట్ హక్కును కూడా పొందాడు ఇప్పుడు అతను ఈ పక్రియ లో 'ఇన్‌స్టాషీల్డ్ వైరస్ కిల్లర్' అనే కొత్త పరికరాన్ని రూపొందించాడు.
నర్సింహాచార్య రూపొందించిన ఇన్‌స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని తెలంగాణ సమాచార-సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా KTR మాట్లాడుతూ ఇలాంటి ఆవిష్కరణలకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని వివరించారు అలాగే తన వినూత్న ఆవిష్కరణకి నర్సింహాచారిని అభినందించారు.
నర్సింహాచారి మాట్లాడుతూ ఇన్‌స్టాషీల్డును రూపొందించడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డానని ప్రతి ఒక్కరికీ దీన్ని చేర్చడమే తన జీవిత ఆశయం అని వెల్లడించారు. కరోనా, ఒమిక్రాన్, డెల్టా వంటి వైరస్‌లను ఈ పరికరం సమర్థవంతంగా సంహరిస్తుందని చెప్పారు. అంతే కాకుండా ఈ ఇన్‌స్టాషీల్డ్‌ను Council Of Scientific And Industrial Research–Centre For Cellular And Molecular Biology, Central మరియు Drugs Standard Control Organisation వంటి సంస్థలు ధ్రువీకరించాయని తెలిపారు.
ప్రస్తుతం ఈ పరికరాన్ని ఆరు సైట్లలో తయారు చేస్తున్నామని, సుమారు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు నరసింహ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 15,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.దీని కొరకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.
ఈ ఇన్‌స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరం 5000 స్క్వేర్ ఫీట్ల వరకు పని చేస్తుందని దీని నుండి వెలువడే ఎలక్ట్రాన్‌లు గోడల నుంచి కూడా బయటకు దూసుకెళ్తాయని, తద్వార వెలుపుల వున్న వైరస్‌లు కూడా చనిపోతాయని పేర్కొన్ననారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ,బ్యాంకులు,హోటళ్లు మరియు హాస్పిటళ్లు వంటి ప్రదేశాల్లో ఈ పరికరాన్ని ఉపయోగించి వైరస్ ను అరికట్టవచ్చని మందాజీ నరసింహా చారి తెలిపారు.
మరిన్ని చదవండి.
Share your comments