తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 59.26 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం గత మూడేళ్లుగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రైతుబంధు పథకం డబ్బులు నల్గొండ జిల్లలో రైతులందరి ఖాతాల్లో పూర్తిస్థాయిలో పడలేదు. రాష్ట్రంలో ఇప్పటికే ఈ రైతుబంధు డబ్బులు జమ చేసే ప్రక్రియ ముగిసింది. కానీ ఇప్పటి వరకు చాలా మంది రైతులకు ఈ డబ్బులు అందలేదు. పంటకు పెట్టుబడులు పెట్టిన రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయో లేదో అని నిరాశకు లోనవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధులను గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి ఎకరానికి రూ.5000 పెట్టుబడి మద్ధతును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొదటిరోజు ఎకరం, రెండో రోజు రెండెకరాలు, మూడోరోజు మూడు ఎకరాలు చెప్పున దశల వారీగా రంగారెడ్డి ట్రెజరీ నుండి రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు డబ్బులను జమ చేశారు. ఐతే రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇంకా 7,561 మంది రైతులకు సుమారుగా రూ.38.9 కోట్ల రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయవల్సిఉంది.
ఇది కూడా చదవండి..
ఉపాధి హామీ కనీస వేతనం పెంపు .. తెలుగు రాష్ట్రాలలో ఎంత పెరిగిందంటే ?
రైతులకు వ్యవసాయశాఖ కూడా రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అన్న సమాచారాన్ని చెప్పడం లేదు. జిల్లాలో రైతుబంధు డబ్బులు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు అందాయి. కానీ పది ఎకరాలు పైబడిన రైతులకు కొంత మందికి ఈ డబ్బులు అందలేదు. రైతులు తమ పంటల పొలాల్లో సాగు కొరకు పెట్టుబడులకు ప్రభుత్వం ఈ రైతుబంధు నిధులను అందిస్తుంది.
సీసన్ లో సరైన సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో అప్పులు చేసి మరి రైతులు సాగు చేయవలసి వస్తుంది. దీనితో అధిక వడ్డీలను తట్టుకోలేక రైతులు కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ రంగారెడ్డి ట్రెజరీ ద్వారా రైతుల ఖాతాల్లో దశల వారిగా జమచేశారు. ఇంకా మిగిలిన రైతుల డబ్బులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు రాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments