
రైతు భరోసా పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 31 లోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ లో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు.
ఇప్పటిదాకా నాలుగు విడతల్లో రైతు భరోసాని మూడు లేదా అంతకంటే తక్కువ ఎకరాలు ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే పెట్టుబడి సాయం కింద వర్తింపజేసింది. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా ఈ సాయం అందబోతోంది. మరో వారం లో 4 ఎకరాలు ఉన్న రైతులకు, మార్చి 31లోగా 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అమలు చేసేటందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం ప్రకారం ఎకరానికి 6 వేల రూపాయిలు రైతుల ఖాతాలో పడతాయి. కానీ సాగు చెయ్యటానికి పనికిరాని 1.20 లక్షల సర్వే నంబర్లని అంటే 3 లక్షల ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగా లేని 3 లక్షల ఎకరాల భూమిని తీసేస్తే, మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఎకరాల రైతులకి కూడా డబ్బు ఇస్తే అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా నిధులు ఇచ్చేనట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు నిధులు జమయ్యాయి. మొత్తం 58.13 లక్షల ఎకరాల సాగుకు రూ. 3,487.82 కోట్ల నిధులు విడుదల చెయ్యడం జరిగింది. జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు గా రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులుప్రతి మండలంలో ఒక గ్రామానికి కేటాయించి ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రైతు భరోసా నాలుగు విడతలుగా అమలు అయ్యింది.
మొదటి విడత లో 17 లక్షల మంది రైతులకు చెందిన సుమారు 9 లక్షల ఎకరాల భూమికి గాను సుమారు రూ.550 కోట్లు జమ చేశారు.
రెండో విడత కింద సుమారు 13 లక్షల మంది రైతులకు, అలానే ఫిబ్రవరి 12న రికార్డుల ప్రకారం పూర్తిగా 56 వేల మంది రైతులకు సుమారు రూ.38 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130 కోట్లు నిధులు జమ చేశారు.
తర్వాత మూడో విడత కింద సుమారు 10 లక్షల మంది వ్యవసాయదారులకు సుమారు 21 లక్షల ఎకరాలకు సుమారు రూ. 1,270 కోట్లు జమ చేసింది.
ఇక నాలుగో విడత కింద సుమారు 9 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు అవసరమని లెక్కించారు.
Share your comments