రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానట్లు BRS పార్టీ ప్రకటించింది.
"రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా.. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకు... అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టాడు."
"ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు. " అని KTR తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
మరోవైపు 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 19 వేల కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా సుమారు 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. దాంతో రైతులు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారుసాంకేతిక కారణాల కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు.
Share your comments