సెంచూరియన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ మానేజ్మెంట్, వ్యవసాయ విద్యార్థులకు ఈ రంగం లోని నూతన మార్పుల గురించి మరియు వ్యవసాయ సాంకేతికతల గురించి బోధించేందుకు, సెంచూరియన్ స్కూల్ అఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యశాఖ మంత్రి, గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.
సెంచూరియన్ స్కూల్ అఫ్ స్మార్ట్ అగ్రికల్చర్.
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, టెక్కలి గ్రామం లో గల, సెంచూరియన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ మానేజ్మెంట్ వారు నూతనంగా సెంచూరియన్ న్స్కూల్ అఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ ని ప్రారంభించారు. ఈ భవనం ప్రారంబోత్సవానికి, విద్య శాఖ మంత్రి, శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిధి గ విచ్చేసారు. దీనితో పాటుగా, యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న కృషి సమ్మేళనం కూడా మంత్రి అయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పురోగతికి, స్మార్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎంతో కీలకం అని అయన అన్నారు, ముఖ్యంగా 70% కంటే ఎక్కువ మంది రైతులు గ్రామాల్లో ఉన్న విజయనగరం జిల్లాలో దీని అవసరం ఎంతగానో ఉంది అన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ వైస్-ప్రెసిడెంట్ డీ.ఎన్ . రావు, మరియు ఛాన్సలర్ జి.స్.ఎన్ . రాజు, సెంచూరియన్ న్స్కూల్ అఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయ విద్యార్థులకు, కొత్త స్మార్ట్ అగ్రికల్చర్ విధానాల్లో అవసరం అయ్యే శిక్షణ ఇచ్చేందుకూ, నూతన సాంకేతికతలు వ్యవసాయం లో విలీనం చేయచ్చు, అని వారు తెలిపారు.
రైతు సమ్మేళనం:
సెంచూరియన్ యూనివర్సిటీ వారి సహకారంతో, కృషి జాగరణ, రైతు సమ్మేళనం నిర్వహించింది. ఫిబ్రవరి, 28-29 తారీకుల్లో జరగబోయే, ఈ సమ్మేళనం మంత్రి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా పార్రంభం అయ్యింది. కృషి జాగరణ్, వ్యవసాయ రంగంలో పురోగతి కోసం గత 27 సంవత్సరాలుగా నిరంతరం పని చేస్తుంది. రైతులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు కృషి జాగరణ్ నిర్వహిస్తుంది. వ్యసాయంలో వచ్చే సమస్యలను, వాటిని నియంత్రించే మార్గాలు, ఇంకా ఇతర జ్ణానాన్ని పంచుకోవడానికి ఈ రైతు సమ్మేళనం ఒక మంచి వేదిక. భారత దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ మరియు సీడ్ టెక్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. కబుతో అగ్రికల్చరల్ మెషినరీ, సుజుకీ మోటార్స్, అరీస్ ఆగ్రో లిమిటెడ్, ఇండియన్ పోటాష్ లిమిటెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, ఇఫ్కో, ఐచర్ ట్రాక్టర్లు, మాన్ ఆగ్రో లిమిటెడ్, మొదలగు కంపెనీలు వారి స్టాల్ల్స్ ని ఏర్పాటు చేసి రైతులకు కోసం రూపొందించిన వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.
Share your comments