News

సంకల్ప్ రిటైల్: వ్యవసాయ ఉత్పత్తుల రిటైల్ రంగాన్ని మారుస్తూ, భారతదేశంలోని గ్రామాల్లో వ్యాపార అవకాశాలను విస్తరించడం

KJ Staff
KJ Staff

భారతీయ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు మరియు నిపుణుల మార్గదర్శకతను విశ్వసనీయంగా అందించాలానే లక్ష్యంతో, సంకల్ప్ రిటైల్ స్టోర్‌లు వ్యవసాయ ఉత్పత్తుల రిటైల్ రంగంలో పెద్ద మార్పును తీసుకువచ్చాయి. ఎన్నో బ్రాండ్‌ల వ్యవసాయ ఉత్పత్తులను ఒకే చోట అందిస్తూ, సంకల్ప్ నిజమైన ఉత్పత్తుల నమ్మకాన్ని మరియు వ్యవసాయ సర్వీసుల సౌలభ్యాన్ని కలిపి రైతులకు అత్యుత్తమ విలువను అందిస్తుంది.

ప్రస్తుతం, ఏడు రాష్ట్రాలు - పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో 100కు పైగా స్టోర్లతో సంకల్ప్ రీటైల్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,000కుపైగా స్టోర్‌లు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ వేగవంతమైన అభివృద్ధికి కారణం ఏమంటే - “అత్యుత్తమ నాణ్యత ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ధరలు, మరియు అత్యున్నత స్థాయి వ్యవసాయ సర్వీసులుని” చెప్పుకోవచ్చు.

సంకల్ప్ యొక్క విలువ ప్రతిపాదనలో మూడు ప్రధాన స్తంభాలు

వ్యవసాయ ఉత్పత్తులు: నమ్మకమైన ఉత్పత్తులు, అందుబాటులో ఉండే ధర, మరియు భరోసా

సంకల్ప్ విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని అందిస్తోంది - ఇందులో విత్తనాలు, ఎరువులు, పంట రక్షణ రసాయనాలు, ప్రత్యేక పోషకాలు, పశు ఆహారం మరియు వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. స్థానిక రిటైలర్‌లతో పోలిస్తే సంకల్ప్ ప్రత్యేకత కేవలం దాని విస్తృత పరిమాణంలోనే కాదు, 100% అసలైన ఉత్పత్తులు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, పోటీతత్వ ధరలు, మరియు విలువ ఆధారిత ఆఫర్‌లు అందించాలనే నిబద్ధతతో ఉంది.

అంతేకాకుండా, ప్రతి కొనుగోలుకు ఉచిత వ్యవసాయ సలహా తోడై ఉంటుంది, ఇది రైతులు కేవలం పెట్టుబడి వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా, వాటిని అధిక దిగుబడి మరియు మెరుగైన పెట్టుబడిపై రాబడి (ఆర్‌ఓఐ) కోసం సమర్థవంతంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.

వ్యవసాయ సలహా: ప్రతి స్టోర్‌లో ఉచిత నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తుంది

ప్రతి సంకల్ప్ స్టోర్‌లో అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక అగ్రి-క్లినిక్ ఉంటుంది, వాళ్ళు ఉచితంగా, వ్యక్తిగత సలహాలను అందిస్తారు. విత్తన నాటడం, పోషకాలు మరియు తెగుళ్ల నిర్వహణ, నీటిపారుదల నిర్వహణ, పిచికారీ పద్ధతులు మరియు మరెన్నో ముఖ్యమైన అంశాలపై రైతులకు మార్గనిర్దేశం చేయడంలో ఈ క్లినిక్‌లు చాలా కీలకం.

సలహా ముఖ్యమైన విధానం రైతులలో నమ్మకాన్ని మరియు దీర్ఘకాలిక సంబంధాన్ని పెంపొందిస్తుంది, తద్వారా వాళ్ళు ఉత్పత్తిని మాత్రమే కాకుండా, దాని ప్రభావాన్ని గరిష్టంగా పొందడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని కూడా పొందగలుగుతారు.

వ్యవసాయ సర్వీసులు: ఆధునిక రైతుల కోసం సమగ్ర పరిష్కారాలు

ఉత్పత్తులు మరియు సలహాలు మాత్రమే కాకుండా, సంకల్ప్ రిటైల్ వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు మరియు మెరుగుపరచడానికి ఒక సర్వీసుల ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తుంది. రైతులు ప్రతి స్టోర్‌లో త్వరిత మట్టి పరీక్ష, నేటి వాతావరణ సమాచారం, మరియు ప్రస్తుత మార్కెట్ ధరలు పొందగలుగుతారు. భవిష్యత్తులో వ్యవసాయ రుణ సౌకర్యం, పంట బీమా సహాయం, మరియు భూమి మీద వ్యవసాయ ఇన్‌పుట్ అన్వయ సర్వీసులు వంటి సేవలను విస్తరించే ప్రణాళికలు జరుగుతున్నాయి, తద్వారా రైతులు ఒకే చోట సమగ్ర పరిష్కారాన్ని పొందగలుగుతారు.

సంకల్ప్ పార్టనర్ మిత్ర బిజినెస్ మాడ్యూల్‌ ద్వారా గ్రామీణ వ్యాపార అవకాశాలను విస్తరించడం

భారతీయ వ్యవసాయంలో పునాది స్థాయిలో అభివృద్ధిని శక్తివంతం చేయడం

భారత వ్యవసాయం మరియు గ్రామీణ మార్కెట్‌లలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో, సంకల్ప్ తన సృజనాత్మక పార్ట్నర్ మిత్రా బిజినెస్ మాడ్యూల్ ద్వారా ఒక నూతన మార్పుకు నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కేవలం వ్యవసాయ మరియు పశువైద్య ఉత్పత్తులను విక్రయించే మార్గం మాత్రమే కాదు — ఇది రైతులకు అనుకూలంగా, వ్యక్తులు మరియు వ్యాపారులకు దేశవ్యాప్తంగా ఉపయోగపడే వికేంద్రీకృత పంపిణీ మోడల్.

సంకల్ప్ పార్ట్‌నర్ మిత్రా మాడ్యూల్ అంటే ఏమి?

ఈ కార్యక్రమం యొక్క ప్రధాన భాగంలో రెండు స్థాయిల మోడల్ ఉంటుంది, ఇది రెండు ముఖ్యమైన పాత్రలను కలుపుతుంది:

సంకల్ప్ పార్ట్‌నర్:

స్థానిక దుకాణదారుడు లేదా అగ్రో-వెట్ డీలర్, తమ ప్రాంతంలో సంకల్ప్ ఉత్పత్తులను విక్రయించే కేంద్రంగా పనిచేస్తారు.

సంకల్ప్ మిత్రా:

ఒక వ్యక్తి -వారు రైతు కావచ్చు, విద్యార్థి కావచ్చు, అగ్రి-గ్రాడ్యుయేట్ కావచ్చు లేదా స్థానిక ప్రభావిత వ్యక్తి కావచ్చు-వీరు భౌతిక దుకాణం అవసరం లేకుండానే తమ గ్రామం లేదా ప్రాంతంలో సంకల్ప్ ఉత్పత్తులను ప్రచారం చేసి, విక్రయించడంలో సహకరిస్తారు.

ఈ పునాది స్థాయి వ్యాపారవేత్తలు కలిసి గ్రామీణ అవసరాలు మరియు ఉత్పత్తుల లభ్యత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, బలమైన మరియు సమగ్ర గ్రామీణ వాణిజ్య వ్యవస్థను పెంపొందిస్తారు.

ఇది ఎలా పని చేస్తుంది

సంకల్ప్ పార్ట్‌నర్‌ల కోసం


ఆసక్తి ఉన్న రిటైలర్‌లు సంకల్ప్ యాప్ లేదా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా రైతుల కోసం ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఆమోదం పొందిన తర్వాత, వారికి ప్రత్యేక పార్ట్‌నర్ డిస్కౌంట్ రేట్ వద్ద స్టాక్ అందుతుంది. ఈ ఉత్పత్తులను వారు తమ దుకాణం నుంచే రైతులకు మరియు స్థానిక కస్టమర్‌లకు నేరుగా విక్రయిస్తారు.

సంకల్ప్ మిత్రాస్ కోసం

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండి, వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి ఉన్న ఎవరైనా యాప్ ద్వారా లేదా రిఫరల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మిత్రాస్ వాట్సాప్ ద్వారా, మౌఖిక ప్రచారం, స్థానిక సందర్శనలు వంటి మార్గాల ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఆర్డర్‌లు సమీపంలోని సంకల్ప్ పార్ట్‌నర్ ద్వారా లేదా నేరుగా కంపెనీ ద్వారా పూర్తి చేయబడతాయి. ప్రతి విక్రయంలో మిత్రాస్ కమిషన్ పొందుతారు.

ప్రధాన ప్రయోజనాలు

స్థానిక యువత మరియు రైతులను శక్తివంతం చేయడం


ఈ మోడల్ గ్రామీణ యువత, మహిళలు, రైతులకు ఆదాయ అవకాశాలను కల్పిస్తుంది. తక్కువ లేదా ఎలాంటి పెట్టుబడి లేకుండానే వారిని సూక్ష్మ వ్యాపారవేత్తలుగా మారుస్తుంది.

గ్రామ స్థాయిలో ఉపాధిని పెంచడం

ఉత్పత్తుల అమ్మకాలను స్థానికీకరించడం ద్వారా, సంకల్ప్ గ్రామాలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది, తద్వారా పట్టణ వలసలను తగ్గిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలాంటి పెట్టుబడి లేకుండా, మంచి లాభాలు పొందచ్చు

మిత్రాస్ ఎటువంటి పెట్టుబడి ప్రమాదం ఉండదు, ఇక పార్ట్‌నర్స్ ఉత్పత్తిని బట్టి 5–10% వరకు వరకు మార్జిన్‌లను సంపాదించవచ్చు.

డిజిటల్ సాధికారత

సంకల్ప్ యాప్ పార్టనర్‌లు మరియు మిత్రాస్ ఇద్దరికీ లీడ్‌లను నిర్వహించడానికి, ఆర్డర్‌లు మరియు కమీషన్లను ట్రాక్ చేయడానికి, అలాగే రియల్-టైమ్ సమాచారం పొందడం వంటి సౌకర్యాలను పొందుతారు. 

నమ్మకమైన నాణ్యమైన ఉత్పత్తులు

పరిశోధన ఆధారిత పశువైద్య దాణా, వ్యవసాయ ఇన్‌పుట్‌లు మరియు వ్యవసాయానికి అవసరమైన వస్తువుల పోర్ట్‌ఫోలియోతో, సంకల్ప్ గ్రామీణ కస్టమర్‌లలో విశ్వసనీయత మరియు నమ్మకాన్ని చేస్తుంది.

శిక్షణ మరియు మద్దతు

ప్రతి సభ్యుడు ప్రారంభ శిక్షణా కార్యక్రమాలు, ఉత్పత్తికి కావాల్సిన జ్ఞానం, విక్రయ సూచనలు మరియు నిరంతర సహాయం - యాప్ మరియు వాట్సాప్ ఛానెల్‌ల ద్వారా - పొందుతారు.

సామాజిక ప్రభావం

ఈ మోడల్ గ్రామీణ సరఫరా వ్యవస్థలను బలపరచి, రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల అందుబాటును పెంచుతుంది. దీని ద్వారా సుస్థిరమైన మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

ఎవరెవరు ఇందులో చేరవచ్చు?

వ్యవసాయ రిటైలర్‌లు మరియు పశు ఆహారం/ఔషధ డీలర్‌లు

ఏదైనా రిటైలర్ - మందుల దుకాణం, కిరాణా, హార్డ్‌వేర్, సిమెంట్, టీ షాప్ మొదలైనవి ఉన్నవారు

అదనపు ఆదాయం కోసం చూసే రైతులు

బలమైన స్థానిక పరిచయాలు ఉన్న గ్రామీణ యువత

మహిళా వ్యాపారవేత్తలు మరియు స్వయం సహాయక సంఘ (ఎస్‌హెచ్‌జి) సభ్యులు

ఇందులో చేరడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు - వ్యవసాయ సమాజంతో కలిసి ఎదగాలనే ఉత్సాహం మరియు సిద్ధత ఉంటే చాలు.

లైసెన్స్ అవసరం లేదు.

ఎలా ప్రారంభించాలి

ఈ-సంకల్ప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

పార్ట్‌నర్ లేదా మిత్రాగా దరఖాస్తు చేయండి

అందులో కావాల్సిన బేసిక్ సమాచారం మరియు లొకేషన్‌ను సబ్మిట్ చేయండి

ఆమోదం పొందిన తర్వాత సంపాదించడం ప్రారంభించండి

లేదా, ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆన్‌బోర్డింగ్ కోసం స్థానిక సంకల్ప్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌ను కూడా సంప్రదించవచ్చు.

సంకల్ప్ రిటైల్ మొబైల్ యాప్ ద్వారా రైతుల డిజిటల్ సాధికారత

సంకల్ప్ రిటైల్ దశాబ్దాలుగా ఆరు భారతీయ రాష్ట్రాలలో రైతులందరికీ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు మరియు ఇతర పంట సంరక్షణ ఉత్పత్తులను అందిస్తూ విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. వందకు పైగా అవుట్‌లెట్‌లతో, కంపెనీ తన ప్రతిష్టను కేవలం ఉత్పత్తుల ఆధారంగానే కాకుండా, ప్రతి స్టోర్‌లో ఇచ్చే సలహా మరియు మార్గదర్శకత్వం ద్వారా తన కీర్తిని పెంపొందించుకుంది. ఇప్పుడు, సంకల్ప్ డిజిటల్ యుగంలో కీలకమైన అడుగును వేస్తూ, రైతులు స్టోర్‌లలో పొందే కనుగొనే నమ్మకం మరియు మద్దతును నేరుగా వారి మొబైల్ ఫోన్‌లకు అందించే సంకల్ప్ మొబైల్ యాప్ను ప్రారంభించింది.

స్టోర్ అనుభవాన్ని డిజిటల్‌ విధానంలో విస్తరించడం

సంకల్ప్ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ సమీపంలోని స్టోర్‌తో నిరంతరం కనెక్ట్ అయ్యేందుకు మరియు ఎప్పుడైనా, ఎక్కడైనా అనేక రకాల సర్వీసులను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా, రైతులు:

స్టోర్ ద్వారా ఉత్పత్తులు బ్రౌజ్ చేయండి:

ప్రతి రైతు వారికి సంబంధించిన స్టోర్‌తో కనెక్ట్ అవుతారు, అందువల్ల సరఫరాల లభ్యత మరియు నమ్మకాన్ని నిర్ధారించవచ్చు.

ఆర్డర్‌లను సులభంగా పెట్టండి:

ఎరువులు, పంట రక్షణ పరిష్కారాలు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పశు ఆహారం వంటి ఇన్‌పుట్లను కేవలం కొన్ని క్లిక్‌లలో ఆర్డర్ చేయచ్చు.

డెలివరీలను ట్రాక్ చేయండి:

రియల్-టైమ్ ఆర్డర్ ట్రాకింగ్ గందరగోళాన్ని తొలగిస్తుంది మరియు రైతులు మెరుగ్గా ప్రణాళిక వేయడానికి సహాయపడుతుంది.

పంట సలహాలను పొందండి:

మెరుగైన వ్యవసాయ నిర్ణయాలకు మద్దతుగా క్రమంగా అప్‌డేట్‌లు, కాలానుగుణ మార్గదర్శకత్వం మరియు నిపుణుల సూచనలు యాప్ ద్వారా పొందచ్చు.

ఆర్డర్ చరిత్రను నిర్వహించండి:

రైతులు ముందు చేసిన ఆర్డర్‌లను సమీక్షించి, ఖర్చులను ట్రాక్ చేసి, తరచుగా ఉపయోగించే ఉత్పత్తులను మళ్లీ ఆర్డర్ చేయచ్చు.

డిజిటల్ చెల్లింపులను ఉపయోగించండి:

సురక్షితమైన చెల్లింపు ఎంపికలు లావాదేవీలను సులభతరం చేస్తాయి మరియు నగదు అవసరాన్ని తగ్గిస్తాయి.

ఈ యాప్ సరళంగా, అర్థం చేసుకోవడానికి సులభంగా, మరియు స్థానిక భాషల్లో అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. దీని వలన వివిధ ప్రాంతాలలోని రైతులు కూడా ఉపయోగించడం సులభం అవుతుంది.

సంకల్ప్ బిజినెస్ మోడల్‌ను బలపరిచడం

సంకల్ప్ బిజినెస్ మోడల్ ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది: ఇది బలమైన రిటైల్ ఉనికి, అంకితమైన ఫీల్డ్ సిబ్బంది, మరియు పార్టనర్ మిత్రా మోడల్ ద్వారా పెరుగుతున్న స్థానిక వ్యాపారవేత్తల నెట్‌వర్క్ కలయిక.

పార్టనర్‌లు-

వీరు వారి అవుట్‌లెట్‌ల ద్వారా సంకల్ప్ ఉత్పత్తులను విక్రయించే ఇప్పటికే ఉన్న దుకాణాల యజమానులు.

మిత్రాస్-

వీరు దుకాణాలు లేకుండా, రైతులను సంకల్ప్‌కు అనుసంధానం చేసే మరియు కమీషన్‌లను సంపాదించే వ్యక్తులు.

ఈ మొబైల్ యాప్‌తో, ఈ నమూనాకు కొత్త కోణం లభించింది. మొదటిసారిగా, కమీషన్ వివరాలను యాప్‌లో నేరుగా పొందుపరిచారు. పార్టనర్‌లు మరియు మిత్రాస్ ఇద్దరూ లాగిన్ అయి వీటిని ట్రాక్ చేయవచ్చు:

వారి నెట్‌వర్క్ ద్వారా ప్లేస్ అయిన ఆర్డర్‌లు

ప్రతి ఆర్డర్‌పై వచ్చిన కమీషన్

నెలవారీ ఆదాయ సంగ్రహ నివేదిక

ఈ పారదర్శకత కారణంగా, పార్టనర్‌లు మరియు మిత్రులు మాన్యువల్ అప్‌డేట్‌లపై ఆధారపడకుండా, రియల్ టైమ్‌లో వారి ఆదాయాన్ని పర్యవేక్షించవచ్చు. ఇది వ్యవస్థపై నమ్మకాన్ని మరియు ప్రేరణను పెంచుతుంది.

క్షేత్ర స్థాయి నుండి అభిప్రాయాలు

యాప్ ప్రారంభోత్సవంలో, సంకల్ప్ ప్రతినిధి ఇలా అన్నారు:

“సంకల్ప్ మొబైల్ యాప్ కేవలం ఆన్‌లైన్ ఆర్డర్ గురించి మాత్రమే కాదు. ఇది రైతులకు సమాచారం, సౌలభ్యం మరియు విశ్వసనీయమైన సరఫరాతో సాధికారత కల్పించడం గురించి ఇందులోని భాగం. మా పార్టనర్‌లు మరియు మిత్రాస్ కోసం, యాప్ వారు సంపాదించిన కమీషన్‌లపై పూర్తి పారదర్శకతను అందిస్తుంది, తద్వారా వారికి అందిన రివార్డ్‌లను తక్షణమే పొందచ్చు.”

ఈ మార్పును రైతులు కూడా నేర్చుకోవడం ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన శ్యామ్ అనే సోయాబీన్ రైతు ఇలా అన్నారు:

 “గతంలో నేను కాల్ చేయాల్సి వచ్చేది లేదా ఫీల్డ్ సిబ్బంది వచ్చే వరకు వేచి చూడవలసి వచ్చేది. ఇప్పుడు యాప్ ఉండడం వల్ల, నేను ఉత్పత్తులను స్వయంగా చూసుకోవచ్చు, ఆర్డర్ ఇవ్వవచ్చు మరియు తక్షణమే అప్‌డేట్‌లను పొందచ్చు. సీజన్ సమయంలో నా పనిని ఈ విధానం సులభతరం చేస్తుంది.”

ముందుకు సాగండి

స్థిరమైన నాణ్యత మరియు విశ్వసనీయతను నిర్ధారించడానికి, సంకల్ప్ రిటైల్ తన స్వదేశీ బ్రాండ్ అయిన -సంకల్ప్‌ను- కూడా ప్రారంభించింది. ఈ బ్రాండ్ ఇప్పుడు విత్తనం, పంట రక్షణ రసాయనాలు, ప్రత్యేక ఎరువులు, మరియు పశువైద్య ఉత్పత్తుల వంటి ముఖ్య విభాగాలలో అందుబాటులో ఉంది. ఈ ఉత్పత్తులు సంకల్ప్ రిటైల్ అవుట్‌లెట్‌లలో మరియు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి, దీని ద్వారా బ్రాండ్ యొక్క ప్రాప్యత మరియు ప్రతిష్ట మరింత బలపడుతుంది.

సంకల్ప్ కేవలం పంపిణీ నెట్‌వర్క్‌ను మాత్రమే నిర్మించడం లేదు—అది సమాజ ఆధారిత వ్యవసాయ-వాణిజ్య పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది. భారతదేశం స్మార్ట్ వ్యవసాయం మరియు డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ల వైపు పయనిస్తున్నందున, సంకల్ప్ పార్ట్‌నర్ మిత్రా మోడల్ వంటి ప్రయత్నాలు ప్రతి గ్రామం మరియు ప్రతి రైతు అభివృద్ధిని అనుభవించేలా చూసుకుంటున్నాయి.

మీ గ్రామంలో మార్పుకు భాగమవ్వండి — ఈ రోజే సంకల్ప్ పార్ట్‌నర్ లేదా మిత్రాలో చేరండి.”

సంకల్ప్ రిటైల్ కేవలం ఒక దుకాణం మాత్రమే కాదు — ఇది రైతుల అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది. విస్తరిస్తున్న ఉనికి, సాంకేతిక ఆధారిత ప్రక్రియలు, మరియు నిపుణుల సూచనలతో, సంకల్ప్ భారతదేశంలోని వ్యవసాయ రిటైల్ భవిష్యత్తును నిర్మిస్తుంది — ఒక స్టోర్, ఒక రైతు, ఒక పరిష్కారంతో ముందుకు నడవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on News

More