ప్రభుత్వరంగ బ్యాంకు సంస్థల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థగా ఎస్బిఐ గుర్తింపు పొందింది. అయితే ఎస్బిఐ చేసిన కొన్ని కీలక మార్పులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఈ మార్పుల ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీల నుండి లభించే అదనపు లాభం పొందేందుకు అవకాశం పోనున్నది.
ఇప్పటివరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేసినవారికి కొన్ని రివార్డ్స్ లభించేవి, వినియోగదారులు ఈ రివార్డ్స్ తమ తదుపరి లావాదేవీల్లో వినియోగించుకునేవారు. అయితే ఎస్బిఐ తమ రివార్డ్స్ ప్రోగ్రాం లో కొన్ని కీలక మార్పులు చేపట్టింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డులతో జరిపే ప్రబుత్వ సంబంధిత లావాదేవీలపై, ఇకనుండి రివార్డ్ పాయింట్లు లభించవని కీలక ప్రకటన చేసింది. ఈ మార్పులు 2024 జూన్ నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డుదారులు ప్రభావితం కానున్నారు.
ఎస్బిఐ విభిన్న శ్రేణిలో క్రెడిట్ కార్డులు అందిస్తుంది, ఈ నిర్ణయం మూలంగా ఈ కార్డులు అన్నిటిమీద ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఉన్న రివార్డు నిర్మాణాన్ని క్రమబద్దీకరించి, వినియోగదారుల మెరుగుపరచడం కోసం ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆధునిక ప్రయాణాలకు మారుతున్న అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో మైల్స్ కార్డులు పరిచయం చేసిన తర్వాత ఎస్బిఐ ఈ మార్పులు చెప్పట్టింది. దీని మూలంగా 50 రకాల క్రెడిట్ కార్డు, క్రెడిట్ పాయింట్స్ ప్రభవితం కానున్నాయి.
Share your comments