News

ఆత్మ నిర్భర్ భారత్ కింద MSME ల కోసం పథకాలు

Srikanth B
Srikanth B
Schemes for MSMEs under Atma Nirbhar Bharat
Schemes for MSMEs under Atma Nirbhar Bharat

దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEలు) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద అనేక కార్యక్రమాలు చేపట్టింది అందులో ముఖ్యమైనవి ఈ రెండు ప్రధాన పథకాలు :

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS):

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని మే, 2020లో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా, అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలు మరియు ఇతర వ్యాపార సంస్థలకు కోవిడ్-19 సంక్షోభం నుంచి కోలుకునేందుకు తమ కార్యకలాపాల నిర్వహణ మరియు పునఃప్రారంభం చేయడానికి సహాయం చేస్తుంది. ఈ పథకం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను కవర్ చేస్తుంది. దీని కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలకు విస్తరించిన క్రెడిట్ సదుపాయానికి సంబంధించి సభ్య రుణ సంస్థలకు (మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్) 100% హామీ అందించబడుతుంది. పథకం వ్యాలిడిటీ 31.03.2023.

సీవీడ్ అంటే ఏమిటి? అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి?

స్వయం సమృద్ధ భారత్ (SRI) ఫండ్:

MSME లలో ఈక్విటీ ఫండింగ్‌ను పెంచడానికి, వృద్ధి చెందగల సామర్థ్యం మరియు సాధ్యాసాధ్యాలు కలిగిన ఈక్విటీ ఫండ్స్‌ను అందించడానికి భారత ప్రభుత్వం సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (SRI) నిధులతో ఫండ్ ఆఫ్ ఫండ్‌లను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వం భారత ప్రభుత్వం నుండి రూ.10,000 కోట్ల కార్పస్‌ను అందిస్తుంది
.

MSME రంగంపై MSME క్లాసిఫికేషన్ (వర్గీకరణ)లో మార్పు ప్రభావాన్ని అంచనా వేయడానికి MSME మంత్రిత్వ శాఖ 7 సెప్టెంబర్, 2021న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)కి ఒక అధ్యయనాన్ని అప్పగించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొన్న నష్టాల అంచనాను కూడా పేర్కొన్న అంతర్గత ఇబ్బందులను ఇందులో చేర్చాయి. 20 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 1,029 ఎంఎస్ఎంఈ లతో కూడిన రాండమ్ శాంపిల్ పూల్‌ను తీసుకొని SIDBI నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. 2022 జనవరి 27న సమర్పించిన అధ్యయన నివేదిక ప్రకారం, 67 శాతం ఎంఎస్ఎంఈ లు 3 నెలల వరకు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. సర్వే చేసిన MSME లలో దాదాపు 65 శాతం మంది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందారని మరియు 36 శాతం మంది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ కింద రుణాలు పొందారని అధ్యయనం వెల్లడించింది.

E-Shram Card: కార్డు ఉంటే రూ.2 లక్షల రుణం, జీవిత బీమా పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి !

Share your comments

Subscribe Magazine

More on News

More