News

చంద్రుడి మట్టి పై మొక్కలను పెంచిన శాస్త్రవేత్తలు!

S Vinay
S Vinay

శాస్త్రవేత్తలు చంద్రుని మట్టిలో మొక్కలను పెంచారు, ఇది ఖచ్చితంగా అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.

అపోలో మిషన్లు 11, 12 మరియు 17లోని వ్యోమగాములు దాదాపు 50 సంవత్సరాల క్రితం చంద్రుని నుండి భూమికి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టిని రెగోలిత్ అని కూడా అంటారు.అయితే శాస్త్రవేత్తలు అరబిడోప్సిస్ థాలియానా అనే వృక్ష జాతుల విత్తనాలను వేశారు అయితే చంద్రుడి మట్టిలో వేసిన విత్తనాలన్నీ మొలకెత్తి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యానికి గురిచేస్తూ కొత్తదారులకి బీజం వేసింది.ఈ అధ్యయనం కమ్యూనికేషన్స్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది. మొక్కలు చంద్రుడి మట్టికి జీవశాస్త్రపరంగా ఎలా స్పందిస్తాయో పరిశోధకులు పరిశోధించారు.

ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చంద్రుడి నేలలో మొక్కలు విజయవంతంగా మొలకెత్తుతాయని మరియు పెరుగుతాయని చూపించారు. చంద్రుని మట్టికి మొక్కలు జీవశాస్త్రపరంగా ఎలా స్పందిస్తాయో కూడా వారి అధ్యయనం పరిశోధించింది, దీనిని లూనార్ రెగోలిత్ అని కూడా పిలుస్తారు, ఇది భూమిపై కనిపించే మట్టికి భిన్నంగా ఉంటుంది.

చంద్రుని నేలలో మొక్కలు పెరుగుతాయో లేదో తెలుసుకోవడానికి. మరియు చంద్రునిపై మొక్కల పెరుగుదల మానవులకు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడానికె ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

చందమామ నేలల్లో మొక్కలను పెంచడం వల్ల నేలల స్థితి కూడా మారవచ్చుని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.చంద్రుని నేలలో మొక్కలు విజయవంతంగా పెరగడం అనేది భవిష్యత్తులో చంద్రునిపై ఆహారం మరియు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇది సుగమనం చేస్తుందని శాస్త్రవేత్తలు విశ్వాసం వక్త్యం చేసారు.

ఈ పరిశోధనకి మద్దతుగా NASA యొక్క బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ విభాగం మరియు ఆస్ట్రోమెటీరియల్స్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ సైన్స్ విభాగం నిధులను సమకూర్చింది.

మరిన్ని చదవండి.

తాజ్ మహల్ మూసి ఉన్న గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తు శాఖ!

Share your comments

Subscribe Magazine

More on News

More