తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చెమటలు పుట్టిస్తున్నాయి. రోజురోజుకి ఎండ తీవ్రత ఎక్కువవుతూవస్తుంది, వడగాల్పులు దీనికి తోడై మరింత రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రాయమయ్యే అవకాశం ఉంది. పనుల రీత్యా బయట తిరిగే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాల మంది వడ దెబ్బ భారిన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కాలం మొదలు కాకమునుపే ఈ విధంగా ఉంటె ఇక మే మధ్యస్థానికి ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకు మధ్యాహన సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిది
12 గంటల నుండి, సాయంత్రం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఇంటి వద్దనే ఉండటం శ్రేయస్కరం. అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు 40-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వడ దెబ్బ భారిన పడి జనం ఆసుపత్రి పాలయ్యే సంఖ్య ఎక్కువవుతుంది.
ఉపాధి కోల్పుతున్న ప్రజలు:
ఎండ తీవ్రత అధికం అవ్వడంతో, భావన నిర్మాణాలు, పొలం పనులు, మరికొన్ని ఇతర కార్యకలాపాలు స్థంభించాయి. దీనితో కూలీపనులపై ఆధారపడే వారు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారి జీవితాన్ని దయనీయంగా మారుస్తుంది. వేసవి సమయంలో ఉపాధి కోసం కొన్ని ప్రాంతాల నుండి ప్రజలు పట్టణాలకు తాత్కాలికంగా వలస వెళ్తారు, అటువంటి వారు ఎందరో పనిదొరక్క, నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వాలు పూనుకొని కనీస ఉపాధి అవకాశాలు కల్పించాలి. వేసవి సమయంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలి. కొన్ని ఎంజిఓ లు ఉపాధి లేక తినడానికి తిండి లేని వారికి భోజనం అందిస్తున్నారు, అటువంటి వారికి ప్రజలు ధన రూపంలో సహాయం చేస్తే వారు మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది.
వర్షాలు పడే సూచనా....
ఎండలకు సతమతమవుతున్న ప్రజలకు ఐఎండి చల్లటి కబురు అందించింది. సముద్ర మట్టంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా, ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో 10,11 తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నటు ఐఎండి తెలిపింది. వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం ఆరబెట్టుకునే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
వడ దెబ్బ భారిన పడే అవకాశం:
అధికంగా నమోదవుతున్న ఎండలు, దానికి తోడైన వడ గాలులు, వడ దెబ్బ భారిన పడే అవకాశలు పెంచుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్దులు, వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ. వీరు బయట వీలైనంత తక్కువ బయట తిరగడం మంచిది. వడ దెబ్బ తగిలి స్పృహకోల్పోయిన వారికి ప్రధమ చికిత్సగా, చల్లని నీడ ప్రదేశానికి చేర్చి, శరీరమంతా చల్లని నీటితో తడిపిన గుడ్డతో తుడవాలి, ఇలా చెయ్యడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. తర్వాత వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి తగిన చికిత్స అందించాలి. ఎండ బారినుండి తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగేబడులు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్లూకోస్ కలిపిన నీళ్లు తాగడం ఉత్తమం. ప్రతిరోజు క్రమం తప్పకుండ పది లీటర్ల నీటిని తాగాలి.
Share your comments