News

ISF వరల్డ్ సీడ్ కాంగ్రెస్ 2024: కృషి జాగరణ్ కు లభించిన విలువైన గౌరవం....

KJ Staff
KJ Staff

ఇంటర్నేషనల్ సీడ్ ఫెడరేషన్ (ISF) మే 27 నుండి మే 29 వరకు, నెథర్లాండ్లోని, రొట్టెర్థం నగరం ప్రపంచ సీడ్ కాంగ్రెస్ పేరిట సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి వ్యవసాయ నిష్ణాతులు ఎందరో హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు చీఫ్ ఎడిటర్ అయిన ఎం.సి. డొమినిక్ కూడా హాజరుకానున్నారు. ఈ ఆహ్వానం కృషి జాగరణ్ నిరంతర శ్రమకు దక్కిన ఒక అరుదైన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. కృషి జాగరణ్ గత 27 సంవత్సరాలుగా వ్యవసాయ మరియు రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న ఉదేశ్యంతో రైతులకోసం ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది కృషి జాగరణ్.

వ్యవసాయంనుండి నాణ్యమైన దిగుబడి రావాలన్న, ఉత్పాదకత పెరగాలన్న మేలైన విత్తనాన్ని ఎంచుకోవడం ముఖ్యం, ప్రపంచంలో ఎన్నో చోట్ల శాస్త్రజ్ఞులు నిరంతరం కొత్త రకాల మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు, మిగిలిన దేశాలకు కూడా అందించడానికి ఏదైనా ఒక సంస్థ పనిచెయ్యవలసి ఉంది. ప్రపంచం మొత్తం మీద కొత్త రకం విత్తనాలను, అన్ని దేశాలకు చేర్చి, దేశాలమధ్య పరస్పర సహకారాన్ని ఏర్పరచడంలో ఐఎస్ఎఫ్ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేటి నుండి మూడురోజులపాటు వరల్డ్ సీడ్ కాంగ్రెస్, కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

మరికొన్ని సంవత్సరాలలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడనుందని ఇప్పటికే ఎఫ్ఏఓ వంటి సంస్థలు ప్రకటించాయి, జనాభా విఫరీతంగా పెరిగిపోవడం, వాతావరణంలో మార్పులు కారణంగా ఆహార కొరత ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ఎన్నో కొత్త రకాల మొక్కలను అభివృద్ధి చెయ్యవలసి ఉంది, వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెయ్యబడిన మొక్కలను రైతుల వద్దకు చేర్చడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం విత్తనాలు. ఈ రోజునుండి ఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం "నావిగేటింగ్ ఇంటూ ది నెక్స్ట్ సెంచరీ" అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విత్తనాలను అభివృద్ధి చేసి అంశం మీద చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది వ్యవసాయ నిపుణులు పాల్గొంటున్నారు.

ఇంక కార్యక్రమ విశేషాల గురుంచి చూస్తే, మొదట ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరిని ఆహ్వానించిన తర్వాత ఇంటర్నేషనల్ సీడ్ ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ, మైఖల్ కెల్లెర్, ప్రపంచమంతా తన ఇల్లు అంటూ అతని ప్రసంగాని మొదలుపెట్టారు, ఈ సమస్థ 1924 లో ఆరుదేశాల నుండి వచ్చిన 30 వర్తకులతో ప్రారంభమై నేడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నేడు నిర్వహిస్తున్న ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం తమ విజయానికి ప్రతికని ప్రస్తావించారు. తరువాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగిలిన అతిధులు కూడా తమ ప్రశాంగాలను వినిపించారు. ప్రపంచ ఆహార భద్రత మేలైన విత్తనంతోనే సాధ్యమని తమ ప్రసంగంలో తెలియచేసారు.

చివరిగా ఈ సంస్థ ప్రెసిడెంట్ మార్కో వాన్ లీవువెన్ ప్రసంగిస్తూ, గత వందేళ్లుగా ఐఎస్ఎఫ్ సాధించిన ఘనత గురించి ప్రస్తావించారు. ప్రపంచ విత్తన వాణిజ్య రంగానికి, మరియు విత్తనాల ఒక దేశం నుండి మరొక్క దేశానికి ఎగుమతి కావడానికి నిబంధలను ప్రతిపాదించడంలో ఎంతగానో కృషి చేస్తుందని వివరించారు. ఆహార నాణ్యతను పెంచి, వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలోనూ తాము కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు, పర్యావరణాన్ని రక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియచేసారు. ఈ విధంగా మొదటి రోజు సమావేశం ముగిసింది.

Share your comments

Subscribe Magazine

More on News

More