ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పోలీస్ అలవెన్స్ లో కోత విధించింది. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం జీవో నెం 79ను జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పోలీస్ అలవెన్స్ కింద 30 శాతాన్ని కేటాయించింది.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ సిబ్బందికి అంతకముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బంది, ఈ సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తారు. గతంలో వీరికి 15 శాతం అలవెన్స్ ఉండేది, ప్రస్తుత ప్రభుత్వం ఈ 15 శాతాన్ని కూడా పూర్తిగా తీసేసింది.
మరొకవైపు డిప్యూటేషన్ పై ఏసీబీలో పని చేస్తున్న వారి అలవెన్స్ 30 శాతం ఉండగా వాటిని 30 నుండి 25 శాతానికి తగ్గించింది. ఈ మార్పులతో పాటు ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వారికి ఇచ్చే అలవెన్స్ శాతాన్ని 10 నుంచి 8 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్ : ఆగస్టు 15 నుండి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి
ఇంకా, ఏజెన్సీలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ను సైతం తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తివేసింది.
జులై 12న అలవెన్సులను తగ్గిస్తూ జీవో 79 నెంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయం ఆమోదంతో ప్రభుత్వం జియోకు అండగా నిలిచింది. ఫలితంగా, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పోలీసు అలవెన్సుల్లో ఇప్పుడు కోతలు ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి..
Share your comments