చలికి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే కాదు దక్షిణ రాష్ట్రాలలో కుడా చలి తీవ్రత అధికముగా తెలుగు రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అటు మన్యం అరకు లోయలో అయితే 1 డిగ్రీ ల వరకు ఉష్ణోగతలు పడిపోయాయి . చలి తీవ్రతకు ఉత్తరాది రాష్ట్రాలలో రాష్ట్రాలలో గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతున్నవారు సంఖ్య కూడా పెరుగుతుంది . ఈనేపథ్యం లో అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలుకూడా జారీఅయ్యాయి .
ఎముకలు కొరికే చలిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆదివాసీలు రోజువారీ పనులు చేసుకుంటున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు వరి నూర్పులు, కాఫీ పండ్ల సేకరణకు వెళుతున్నారు. పనులకు ఉదయం వెళ్లడం వల్ల చేతులు, కాళ్లు చచ్చుబడిపోతున్నాయని, స్పర్శ ఉండడం లేదని ప్రజలు అంటున్నారు. ఇంట్లో నిల్వ చేసుకున్న నీళ్లు డీప్ ఫ్రిజ్ నుంచి తీసినట్టు ఉంటున్నాయి. నీళ్లు వేడి చేసుకుంటే గానీ తాగలేని పరిస్థితి. పెంకులు, రేకుల ఇళ్లల్లో ఉండే వారి పరిస్థితి దారుణంగా ఉంది. చలి తీవ్రత వల్ల ప్రజలు పలురకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మకర సంక్రాంతి 2023: సంక్రాంతిని వివిధ పేర్లతో జరుపుకునే రాష్ట్రాలు ఇవే ...!
ఆదివారం చింతపల్లి, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లో 1.5 డిగ్రీలు, జీకే వీధిలో 2.2, పెదబయలు, డుంబ్రిగుడ 2.6, ముంచంగిపుట్టు 2.8, పాడేరు 3.1, అరకులోయలో 3.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. ప్రస్తుతం గిరిజన ప్రజలు చలి ఉధృతికి అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ చల్లగాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్ లో సైతం ఉష్ణోగ్రతలు భారిగా పడిపోయాయి చలితో ప్రజలు వణుకుతున్నారు , సీజన్ నార్మల్ కంటే తక్కువగా నమోదవడంతో చలి తీవ్రత పెరిగింది . చలి తీవ్రత పెరుగుతున్న క్రమంలో వృద్దులు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు .
Share your comments