ఈ ఆధునిక కాలంలో ఏది చూసినా కల్తీనే జరుగుతుంది. పంటలు పండించే విత్తనాల నుండి మనం తినే ఆహరం వరకు చాలా కల్తీలు జరుగుతున్నాయి. కానీ, మనం తాగే ఈ ప్యాకెట్ పాలు కూడా కల్తీ అన్న విషయం మీకు తెలుసా. ఈ పాలు మనకు విషంలా మారుతుంది. ఈ పాలను మరియు పెరుగును తినడం వలన మనుషులలో దీర్ఘకాలిక రోగాలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో స్వచ్ఛమైన పాలు కూడా మనకు లభ్యమవ్వక, తప్పని పరిస్థితుల్లో ఈ ప్యాకెట్ పాలకు అలవాటుపడ్డాం. ఇవి మంచివి కాదని తెలుసు, కానీ ప్రాణాంతకం అని తేలింది.
మన ఆరోగ్యం కోసమని మనం ఈ పాలను మరియు పెరుగును వాడుతున్నాం, కాని వీటిని ఉత్పత్తి చేసే సంస్థలు వాటిని కల్తీ చేస్తున్నాయి. ఈ పాలు మరియు పెరుగుకు సంబంధించిన కొంన్జీ సంస్థలు పాల యొక్క చిక్కదనాన్ని పెంచడానికి, దానితోపాటు పాల నిల్వ సమయాన్ని పెంచడానికి కల్తీలు చేస్తున్నాయి.
దీనికోసమని ఈ పాల ఉత్పత్తి కంపెనీలు ఫార్మలిన్ అనే రసాయనాన్ని మరియు ప్రొటీన్ బైండర్ అనే రసాయనాన్ని పాలలో కలుపుతున్నారు. సాధారణంగా ఈ ఫార్మలిన్ అనే రసాయనాన్ని శవాలను నిల్వ పరిచేందుకు వాడతారు. ఈ విషయాన్ని ఎవరో చెప్పట్లే, దీనిని మన రాష్ట్ర ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ పాలను మరియు పెరుగును వాడటం వలన మన శరీరంలో ముఖ్యమైన అవయవాలైన మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటున్నాయి. దీనిపై చర్యలు తీసుకుంటూ అధికారులు ఇంచుమించుగా 8 పెరుగు కంపెనీలను మరియు 15 పాల కంపెనీలను సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి..
కొత్త బిజినెస్ ఐడియా : సిరులు కురిపిస్తున్న పైనాపిల్ సాగు..
పాలను పాడవకుండా చూసుకోవడానికి వాటిని చల్లని ప్రదేశాల్లో ఉంచాలి, లేదంటే అవి పాడయిపోతాయి. దీనివలన పాలను ఎక్కువ దూరం సరఫర చేయలేకపోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ పాల ఉత్పత్తి కంపెనీలు పాలల్లో ఈ ఫార్మలిన్ అనే రసాయనాన్ని కలుపుతున్నారు.
సాదరణంగా ఈ ఫార్మలిన్ త్వరగా పాడైపోయే వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు దీన్ని వినియోగిస్తారు. దీనివలన పాలు చిక్కగా మరియు చల్లని ప్రదేశంలో ఉంచకపోయిన ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ రసాయనాన్ని అధిక మోతాదులో కలిపి ఎక్కువ దూరాలకు రవాణా చేస్తున్నాయి ఈ పాల కంపెనీలు.
ఇది వేసవి కాలం కావడంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గుతుంది, కానీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి అనేది 35 లక్షల లీటర్లు మాత్రమే ఉంది, కానీ డిమాండ్ అనేది 45 లక్షల లీటర్ల వరకు ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా లేకపోవడంతో, దీనిని అదనంగా తీసుకుని ఈ పాల కంపెనీలు వారికి నచ్చినట్లు కల్తీలు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments