తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువుగా పండించే పంట వరి. ఖరీఫ్ మరియు రబి సీజన్లో వరిని విరివిగా సాగుచేస్తుంటారు. మిగిలిన పంటలతో పోల్చుకుంటే వరి యాజమాన్యం కష్టంగానే ఉంటుంది. విత్తు నాటే దగ్గరనుండి కోత కోసే వరకు కూలీలా అవసరం చాల ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కూలీలా కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కూలీలు దొరికిన అధికమొత్తంలో కూలీ చెల్లించవలసి ఉంటుందని రైతులు వాపోతున్నారు. పంట పెట్టుబడిలో అధిక శాతం కూలీలకు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఖరీఫ్ సీసన్కి సన్నాహాలు మొదలవుతున్నాయి. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా, వరి పంటను అధిక మొత్తంలో సాగుచేయనున్నారు. వరి సేద్యానికి కూలీలా అవసరం కూడా చాల ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం చాల కష్టతరంగా మారింది. వరి నాట్లు వెయ్యడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, ఎరువులు, పురుగుమందులు పిచికారీ చెయ్యడానికి, మరియు పంట కోత కొయ్యడానికి ఇలా అన్ని దశల్లోనూ కూలీలు అవసరం. ఈ అవసరాలన్నిటికి యంత్రాలున్నా, ఇప్పటికి చాల మంది రైతులు కూలీలా పైనే ఆధారపడుతున్నారు.
ఇది కూడా చదవండి.....
తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్: ఈ రైతులకు రైతుబంధు కట్...
సాగు నీటి లభ్యత మరియు సబ్సిడీలో వస్తున్న ఎరువులు, వీటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువమంది రైతులు, వరి సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కూలీలలకు డిమాండ్ పెరిగి కూలీలా వేతనం కూడా పెరిపోయింది. మన దగ్గర ఉన్న కూలీలు సరిపోక, బీహార్ లాంటి రాష్ట్రాలనుండి కూడా కూలీలను తీసుకువస్తున్నారు. ఒక రోజుకి కూలి 500-1000 రూ. వరకు చెలించవలసివస్తుంది. అంతే కాకుండా కూలీలా రవాణా మరియు భోజనాల ఖర్చులు రైతులే భరించవలసి వస్తుంది. ఒక ఎకరం పొలలో నాట్లు వెయ్యడానికి సుమారు 7,000-8,000 రూ. వరకు ఖర్చు వస్తుందని రైతులు చెప్తున్నారు. ఈ పరిస్థితి నియంత్రించేందుకు, రైతులు వరి నాటే యంత్రాలు ఉపయోగించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కేవలం వరిపంటే కాకుండా మొక్కజొన్న, పత్తి పంటలమీద కూడా రైతులు దృష్టిసారించాలి.
Share your comments