News

రైతన్నల పెద్ద పండుగ ఏరువాక పూర్ణిమ నేడే.. ఈ పండుగ విశిష్టత, ప్రత్యేకత తెలుసా?

KJ Staff
KJ Staff
eruvaka pournami
eruvaka pournami

ఏరువాక పూర్ణిమ. మన దేశంలో రైతులు జరుపుకునే పెద్ద పండుగ ఇదే. రైతులకు ప్రత్యేకంగా ఏదైనా పండుగ ఉందంటే.. అది ఇదే. ఈ పండుగకు ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉంది. సాంప్రదాయబద్దంగా రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజుని అత్యంత మంచిరోజులగా రైతులు భావించి పంటలు వేస్తారు. పోలాలకు వెళ్లి భూదేవతకు పూజలు చేసి ఆ తర్వాత పంటలు వేస్తారు. ఎంతో ఆనందంగా ఈ పండుగను రైతులు జరుపుకుంటారు. మన దేశంలో ఎక్కువమంది వ్యవసాయ మీద జీవించేవారే.

వ్యవసాయమే వృత్తిగా ఎంచుకుని జీవనాధారం సాగించేవాళ్లే 70 శాతం మంది ఉన్నారు. అందుకే దేశంలో ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఆధునీకత పెరిగినా.. రైతులు తమ ఆచార, సాంప్రదాయాలను మరిచిపోలేదు. ఈ పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. అత్యంత ప్రాచీనమైన పండుగ ఇది.

ఏరువాక అంటే ఏమిటి?.. ఎప్పుడు వస్తుంది?

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగ వస్తుంది. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. ఇవాళ రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. ఆ తర్వాత పోలానికి వెళ్లి భూతల్లికి భూజలు చేసి దుక్కి దున్నం ప్రారంభిస్తారు.

రైతులందరూ కలిసి సామూహికంగా ఎద్దులను పోలాలకు తీసుకెళ్లి దుక్కి దున్నుతారు. అలాగే ఈ రోజు ఎద్దుల పందేలను నిర్వహిస్తారు. ఎద్దులను పరిగెత్తించి దాని వెనుక యువకులు పరుగులు తీస్తారు. అలాగే ఎద్దులకు బండలు కట్టి పరుగులు తీయిస్తారు. ఆడపడుచులు ఈ రోజే ఇంటికి వస్తారు.

శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

శాస్త్రాలు, పురాణాల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అంటారు. పోలం పనులు ప్రారంభించడానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం అని చెబుతారు. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

Share your comments

Subscribe Magazine

More on News

More