వేసవి కాలం అనగానే సగటు మధ్యతరగతి కుటుంబానికి గుర్తు వచ్చేది కరెంటు బిల్లుల మోత .. ఎక్కడ ఫ్యాన్ ఎక్కవ వాడితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందేమో అన్న భయం .. వేసవిలో ప్రతి ఇంట్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లతోపాటు అనేక రకాల భారీ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం లేనిదే నడవదు దీని వల్ల ఇంటి విద్యుత్ ఖర్చు కూడా పెరుగుతుంది.
అయితే మీకు కరెంటు బిల్లు సమస్య తగ్గించు కోవాలను కునే వారికీ కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్‌టాప్ పథకం అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఇంటిపై సోలార్ ప్యానల్ లను అమర్చుకొని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. సౌరశక్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో డిస్కమ్ ప్యానెల్‌లో చేర్చబడిన ఏదైనా విక్రేత నుండి మీరు ఇంటి పైకప్పుపై సోలార్ పీనల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకోవచ్చు.దీని కోసం మీరు దరఖాస్తు చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు.
దరఖాస్తు కు అవసరమైన ధ్రువ పత్రాలు :
అధికారిక నివాస ధ్రువపత్రం
ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు
విద్యుత్ బిల్లు డిపాజిట్ రసీదు
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్న పైకప్పు ఫొటో
PM -KUSUM YOJANA TELANGANA : ప్రధానమంత్రి కుసుమ యోజన ఏమిటి ?
ఎంత ఖర్చు అవుతుంది :ఉదాహరణకు మీరు 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను అమర్చినట్లయితే, దాని ధర సుమారు 70-75 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం నుంచి 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇది మీకు 25 సంవత్సరాలవరకు పని చేస్తుంది .
Share your comments