మన దగ్గర పండే మామిడిపళ్లకి దేశీయంగా మంచి గుర్తింపు ఉంది.అందులో బంగినపల్లి మామిడికి అయితే ప్రత్యేక స్థానం ఉంది. బంగినపల్లి మామిడి పళ్లు మన రెండు రాష్ట్రాల్లో విస్తారంగా పండుతాయి.విదేశాల్లో కూడా మన మామిడికి మంచి డిమాండ్ వుంది.ముఖ్యంగా బంగిన పల్లి మామిడి పళ్లని దిగుమతి చేసుకోవడానికి విదేశీయులు మక్కువ చూపుతున్నారు.వీటికి ఆకర్షణీయమైన ధర కూడా లభిస్తుంది
భారతదేశం నుండి మామిడి పళ్ళని ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,బ్రిటన్,కతర్, ఒమన్, కువైట్ జర్మనీ వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.వీటిలో ఎక్కువగా అల్ఫన్సో,దశేరి,బంగినపల్లి,చౌస,తోతాపురి,లాంగ్ర మరియు కేసరి వంటి రకాలు ఉన్నాయి. ఐతే ఇప్పుడు బంగినపల్లి మామిడి రకాన్ని దక్షిణ కొరియా వాసులు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు.ఈ విషయాన్నీకేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.
తెలుగు రాష్ట్రాల్లో బాగా పండే ఈ మామిడికి 2017సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు(Geographically identified, GI Tag) వచ్చింది. బంగినపల్లి మామిడికి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో దరఖాస్తు చేసింది.ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో తెలంగాణలోని ఖమ్మం,రంగారెడ్డి మరియు మెదక్ వంటి జిల్లాల్లో వీటి ఉత్పత్తి విస్తారంగా ఉంది. ప్రస్తుతం వీటిని దిగుమతి చేసుకోవడంలో దక్షిణ కొరియా అగ్ర స్థానంలో ఉంది. భౌగోళిక గుర్తింపు(Geographically identified, GI Tag) పొందిన ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది. కేవలం బంగినపల్లి మామిడి పండు కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు(Geographically identified, GI Tag) వచ్చింది వాటిలో అరకు వ్యాలీ అరబికా కాఫీ, గుంటూరు మిర్చి,కొండపల్లి బొమ్మాలు ,శ్రీకాళహస్తి కలంకరి,ఉప్పాడ జమ్దానీ చీరలు,తిరుపతి లడ్డూ మరియు వేంకటగిరి చీరలు వంటివి ఉన్నాయి.
మామిడి ఎగుమతికి కావాల్సిన ప్రధాన అంశాలు:
మామిడి పండ్లు నాణ్యతగా ఉండాలి.
ఎంచుకున్న మామిడి పండ్లు రవాణాకు అనుకూలంగా ఉండాలి.
మామిడిని పండించినప్పుడు వాటికి రసాయన ఎరువుల కన్నా సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడాలి.
మామిడి పండ్లకి ఎలాంటి వ్యాధులు మరియు పురుగులు సోకకుండా జాగ్రత్త పడాలి.
మరిన్ని చదవండి.
Share your comments