భారీ ఎండలు ,వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణశాఖ .. రానున్న రెండు మూడు రోజులలో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి ,రుతుపవనాల రాకతో సంబంధం లేకుండా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతాహవారణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది .
అమరావతి వాతావరణ కేంద్రం, నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు మరియు తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట పరిసర ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలోని కర్ణాటక, శ్రీహరికోట, రత్నగిరి, ధర్మపురి, హాసన్ మరియు శివమొగ్గలతో సహా పలు ప్రాంతాలపై రుతుపవనాలు ప్రభావం చూపుతున్నాయని ఐఎండీ నివేదించింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇది కూడా చదవండీ..
రెండు రోజులలో ముగియనున్న ఆధార్ అప్డేట్ గడువు .. అప్డేట్ చేసుకోండి ఇలా !
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలకు ఆదివారం చేరుకున్నాయి, పశ్చిమం నుండి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణాలో మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
ఇది కూడా చదవండీ..
Share your comments