News

సోయాచిక్కుడు (ఓ అంతర పంట)

CH Krupadevi
CH Krupadevi

పెరుగుతున్న జనాభాకు  అనుగుణంగా ఆహార అవసరాలు మాత్రం తీరడంలేదు. వ్యవసాయరంగంలో ఎంత అభివృద్ధిని సాధించినా, ఎంత సాంకేతికతను  ఉపయోగించినా,  అధిక లాభాలను పొందడం అనేది నేటి ఆధునిక యువరైతుల  ముందు ఓ పెను సవాలుగానే మిగులుతుందని  చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలోనే నేటి తరం రైతులు నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అంతర పంటలను ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ప్రధాన పంటకు పెట్టె,  పెట్టుబడిలో కొంత మొత్తాన్ని అంతర పంటలను సాగు చేసి పొందుతున్నారు. ఇలాంటి అంతర పంటల సాగులో సోయా చిక్కుడు కూడ ఒకటి. వర్షాధారంగా సాగు చేసే  నల్లరేగడి నేలల్లో ఏడాదిలో రెండు పంటలు వేయడం, ఒకే పంటలో అంతర పంటలను సాగు చేయడం ద్వారా నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు.  చిన్న, సన్నకారు రైతులకు అంతర పంటల విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

అంతర పంటలు ఎంపిక చేసుకునేటప్పుడు నేలలోని వనరులు సూర్యరశ్మిని చక్కగా వినియోగించుకోగల వాటినే ఎన్నుకోవాలి. అపరాలు  అంతరపంటకు అనుకూలం.  దీనితో పాటు లెగ్యూమ్ జాతికి చెందిన సోయా చిక్కుడు కూడా అనువైన పంట. దీనిని కంది, పత్తి,చెరకు,మొదలైన ప్రధాన పంటలలో అంతరపంటగ సాగు చేయవచ్చునని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  అంతరపంటగ సోయాచిక్కుడు వేయడం వలన కలిగే ఉపయోగాలను పరిశీలిద్దాం.

 సోయాచిక్కుడు  పప్పు జాతి   (లెగ్యూమ్) పైరు. కాబట్టి,  సంవత్సరానికి ఒక ఎకరాకు సుమారు 48-  60 కిలోల నత్రజనిని వేరుబుడిపెలలో స్థీరీకరిస్తుంది.  దీనిలో సోయాచిక్కుడు అవసరానికి పోగగ,  ఇంకా 30- 40 కిలోల నత్రజని  భూమిలోనె మిగిలి ఉంటుంది.  ఇది ఇతర ప్రధాన పంటలకు ఉపయోగపడుతుంది. సోయాచిక్కుడుకు నీటి అవసరం చాలా తక్కువ. దీని వేర్లు త్వరగా నేలలోకి  చొచ్చుకుని పోయి భూమి లోపల ఉన్న నీటిని త్వరగా గ్రహిస్తాయి. నల్లరేగడి భూముల్లో లోతుగా విస్తరించి  ఉండే ఈ సోయాచిక్కుడు వేర్లు నేలను గుల్ల బార్చి గాలి ఆడేలా చేస్తాయి.సోయాచిక్కుడు

త్వరగా  పెరిగి నేలను కప్పి వేస్తుంది. దీని ద్వారా సాళ్ల మధ్య కలుపును అణగదొక్క గలదు. సూర్యరశ్మిని బాగా వినియోగించుకుంటుంది.సోయాచిక్కుడు కోతకు వచ్చేనాటికి ఆకులు రాల్చడం ద్వారా ముఖ్యమైన  పంట సాళ్ళ మధ్య సుమారు ఒక టన్ను సేంద్రియ పదార్థాన్ని తయారు చేస్తుంది. కుళ్ళిన వీటి ఆకుల ద్వారా నత్రజని, ఇతర పోషక పదార్థాలు,ప్రధాన పంటకు లభిస్తాయి.  కందిలో సోయా చిక్కుడును అంతరపంటగా సాగు చేయాలంటే, నల్లరేగడి నేలల్లో తొలకరిలో రెండు కంది సాళ్ళ మధ్య ఏడు సోయాచిక్కుడు సాళ్లు పెట్టాలి. లేదా, రెండు జంట కంది సాళ్ల మధ్య ఐదు సాళ్ల సోయాచిక్కుడు సాళ్లను పెట్టాలి. కందిలో సోయాచిక్కుడు వేస్తే, దాని నిష్పత్తి వేరు వేరుగా ఉంటుంది. జంటసాళ్ల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, సాళ్ల మధ్య దూరం 150 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి.  ఒక ఎకరాకు 15 కిలోల సోయా విత్తనాలు సరిపోతాయి.

పత్తి పంటలో సోయాచిక్కుడుని అంతర పంటగా సాగు చేస్తే,పత్తిని ఆశించే కీటకాల బెడద తగ్గుతుంది. ఇంకా ఈ నల్లరేగడి నేలల్లో  అధిక వర్షాలు కురిసే టప్పుడు, పత్తి మొక్కలు చనిపోకుండా  ఈ సోయాచిక్కుడు నివారిస్తుంది.

సోయా చిక్కుడును పత్తిలో అంతరపంటగా వేసేటప్పుడు దాని సాళ్ల నిష్పత్తి పత్తి పంట సాళ్ల మధ్య  అనుసరించే దూరాన్ని బట్టి,  పత్తి రకాన్ని బట్టి,  సోయాచిక్కుడు రకాన్ని బట్టి, మార్చుకోవలసి ఉంటుంది.  అందుకే తక్కువ కాలపరిమితి గల రకాలను (90 రోజుల్లోపు) నిర్ణీత ఎత్తు మాత్రమే పెరిగే సోయా రకాలను పత్తి పంటలో అంతర్ పంటగా వేయాలి. జె.ఎస్ 335, జె.ఎస్ 93-05  రకాలను పత్తి పంటలో అంతర పంటగా వేయాలి. ఎకరాకు సుమారు 15 కిలోల సోయా విత్తనాలు సరిపోతాయి. సోయాను పత్తి లోనే పెట్టాలి. సోయాచిక్కుడు సాళ్ల మధ్య దూరం 12 సెంటీ మీటర్లు ఉన్నప్పుడు మూడు వరసలు,90 సెం,మీ, లు ఉన్నప్పుడు రెండు వరుసలలో సోయా విత్తనాలు వేయాలి.

సోయా చిక్కుడు ను అంతర్ పంటగా వేసేటప్పుడు ఈ క్రింది మెళుకువలను పాటించాలి.

 పత్తిలో సోయాను అంతరపంటగా రెండుసార్లు వేసినప్పుడు హెక్టారుకు  690 కిలోల సోయాచిక్కుడు, 53  క్వింటాళ్ళ పత్తి దిగుబడి వచ్చింది.అలాగే,పత్తిలో మూడు సార్లు సోయాచిక్కుడు వేసినప్పుడు 710 కిలోల సోయా, 50 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది.

కందిలో అంతర పంటగా సోయాచిక్కుడు వేసినప్పుడు  ఒక సాళు కంది, 6సాళ్లు  సోయా వేస్తే, ఒక హెక్టారుకు 820 కిలోల సోయా, 1480 కిలోల కంది దిగుబడి వస్తుంది. అలాగే రెండు సాళ్లు కంది ఐదు సాళ్లు సోయాచిక్కుడు వేసినప్పుడు  760 కిలోల సోయా,  1360 కిలోల కంది దిగుబడి వచ్చింది.

సోయాచిక్కుడు వేర్ల బుడిపెలు బాగా ఏర్పడడానికి రైజోబియం కల్చర్ ను విత్తనాలకు పట్టించాలి. విత్తనాలు పెట్టేటప్పుడు సాళ్ళ మీద నీడ పడకుండా ఉండాలంటే తూర్పు,  పడమర గా నాటాలి. సోయాచిక్కుడు కు మొదటి 20- 25 రోజుల లోపు నత్రజనిని అందించాల్సి ఉంటుంది.  కాబట్టి, దుక్కి లోనే ఎకరాకు 12 కిలోల నత్రజని ఎరువులను వేయాలి. అంతరపంటగా సోయాచిక్కుడును సాగు చేసేటప్పుడు వాటి వరుసల సంఖ్య మించకూడదు. సాళ్ల లో మొక్కల సాంద్రత ఎక్కువ కాకుండా చూడాలి.  సోయా చిక్కుడు ను కోత సమయంలో పీకరాదు.  మొదళ్ల వరకె కొడవళ్లతో కోయాలి. దీనివలన వేళ్ళ లో ఉన్న నత్రజని నేలలో కలిసి ప్రధాన పంటకు ఉపయోగపడుతుంది.

Related Topics

chikkudu soya antara panta

Share your comments

Subscribe Magazine