News

మేడారం జాతర నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు ...

Srikanth B
Srikanth B
medaram jathara @2023
medaram jathara @2023

 

ఆసియాలోనే అతిపెద్ద జాతర పండుగలలో ఒకటైన మేడారం జాతర 2023 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నట్లు మేడారం ఆలయ ట్రస్ట్ కమిటీ మంగళవారం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ద్వైవార్షిక జాతరను నిర్వహిస్తుండగా, ఆలయ పూజారులు ఈ మధ్య సంవత్సరంలో భక్తుల అభ్యర్థన మేరకు మినీ జాతర (మండ మెలిగే) నిర్వహిస్తారు.
సమ్మక్క-సారలమ్మ మేడారం ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 1న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ బహిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపూలతో పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగే ఆచారం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనుంది. గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పూజారుల సంఘం కోరింది

రెండేళ్లకు ఒకసారి జరిగే అసలు జాతర ఇప్పటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మేడారం మినీ జాతర నిర్వహణకు ముహర్తం ఖరారైంది. ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మినీ జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నారు. మర్నాడు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురారు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. మినీ సమ్మక్క – సారలమ్మ జాతరను మేడారంతో పాటు పూనుగొండ్ల, బయ్యక్కపేట, కొండాయి లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Topics

medaram

Share your comments

Subscribe Magazine

More on News

More