ప్రపంచంలో ఏడు వింతలంటారు, బహుశా వాటికి వాటికి ఛాలెంజ్ చేయలనిపించిందేమో ఈ వ్యక్తికి అనుకున్నదే తడవుగా ఇతగాడు కుక్కకు ఏ మాత్రం తగ్గని విధంగా కుక్క దుస్తువులను ఆర్డర్ వేసు మరీ తయారుచేయించుకున్నాడు.
మీరు ఇప్పటి వరకు స్పైడర్ మ్యాన్,బ్యాట్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్ గురించి విని ఉంటారు కానీ ఇప్పుడు మనం డాగ్ మ్యాన్ గురించి తెలుసుకుందాం,వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజంగా జరిగింది, ఇందులో మన అదృష్టం ఏంటంటే ఈ సంఘటన మన భారత్ లో జరగలేదు.కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి, కోతి నుండి రూపాంతరం చెందాడని విన్నాం, ఇప్పుడు మనిషి మరల కుక్కలా రూపాంతరం చెందుతున్నాడు అని ఇతడి చేష్టలు చెబుతున్నాయి, జిహ్వకో రుచి అన్నట్లు ఇతడి రుచి మనం ఊహించనిది.
జపాన్ కు చెందిన టాకో అనే వ్యక్తి తన చిరకాల స్వప్నాన్ని, అంటే ఇతను కుక్కలా జీవించాలనుకున్నాడు. దీనిని నెరవేర్చుకోవడానికి దాదాపు 2 మిలియన్ యెన్లు అనగా మన దేశ కరెన్సీ లో రూ.12.17 లక్షలు వెచ్చించాడు. కుక్క కాస్ట్యూమ్ తయారు చేయించడానికి చేయడంలో ప్రత్యేకత 'సెపెట్' అని పిలవబడే పేరు గాంచిన సంస్థను సంప్రదించాడు, ఈ సంస్థ సినిమాలు, కమర్షియల్ పెర్‌ఫార్మెన్స్‌ల కోసం విభిన్నమైన కాస్ట్యూమ్ లను తయారుచేయడంలో దిట్ట. అయితే టాకో తన ఆలోచనను వివరించగా దీనిని ఒక ఛాలంజ్ గ తీసుకొని శరీరమంతా బొచ్చు ఉండేలా ఈ దుస్తువులను తయారు చేసారు.
టోకో తనకు ఈ రకమైన కుక్క రూపం చాలా కాలంగా కోరుకుంటున్నానని, చాలా ఆలోచించిన తర్వాత కుక్కగా మారాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. శరీరమంతా బొచ్చు ఉన్నందున కోలీ డాగ్‌ని ఎంచుకున్నట్లు వెల్లడించాడు. ఐతే తనకి చిన్నప్పటి నుంచి కుక్కలంటే విపరీతమైన ఇష్టమని కాబట్టి కుక్కలా జీవించడానికి నిర్ణయించుకున్నాను అని తెలిపారు.
ఏది ఏమైనప్పటికి టాకో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments