హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం విడుదల అయిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో దాదాపు 25 స్కూల్స్ యొక్క , ఉతీర్ణత శాతం సున్నా గా నమోదవ్వడం విచారమైన సంఘఠన అని అధికారులు తెలిపారు
తెలంగాణ SSC ఫలితాలలో , మొత్తం 25 స్కూల్స్ నుండి విద్యార్థుల ఉతీర్ణత శాతం 0 % గా నమోదయింది. అంటే ఆ పాఠశాల నుండి ఒక్క విద్యార్థి కూడా పరీక్షల్లో ఉతీర్ణత పొందలేదు అన్నమాట. ఈ రకమైన ఫలితాలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ప్రధమ కారణాలు మాత్రం ఆయా పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష ధోరణ మరియు ఆ పాఠశాల్లో విద్యార్థుల క్రమ రహిత హాజరు అయుండొచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త..
గత ఏడాది SSC పరీక్ష ఫలితాల్లో కూడా మొత్తం 15 పాఠశాలల నుండి సున్నా ఉతీర్ణత శాతం నమోదయ్యింది, కాని ఈ సంవత్సరం దానికి రెండు రెట్లు నమోదవ్వడం, పాఠశాలలకు , ఉపాధ్యాయులకు సిగ్గుపడాల్సిన తరుణం అని చెప్పాలి. ఈ 25 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉందని కొన్ని పాఠశాలలో అయితే 10వ తరగతి క్లాసులో 15 విద్యార్థులు కూడా లేరని , ఇది సున్నా ఉతీర్ణత శాతం రాడానికి ప్రధమ కారణం అయుండొచ్చని అధికారులు ఎన్నారు, అది పక్కన పెడితే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే లేకపోవడం ఇంకో ముఖ్య కారణం అని , వై . రాజ శేఖర రావు అన్నారు . నమోదయిన 25 పాఠశాలలో, 13 ప్రైవేట్ స్కూల్స్ కాగా, 9 జిల్లా పరిషద్ స్కూల్స్, 3 ఎయిడెడ్ స్కూల్స్.
డిపార్ట్మెంట్ లోని అధికారుల ప్రకారం, తక్కువ ఉతీర్ణత ఉన్న పాఠశాలలను నిషేదించే అధికారం మాకు లేనప్పటికీ, అలా సున్నా ఉతీర్ణత శాతం రాడానికి కారణాలు ఏమై ఉండొచ్చని తమ జిల్లా లెవెల్ కమిట తో క్షుణ్ణం గా విచారించి, తగిన చర్యలు తీసుకుంటామని , ఎ . దేవసేన ,డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి
Share your comments