మనిషికి కావలసిన పోషకాలు పొందటానికి రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే అవి మనకి సమృద్ధిగా దొరుకుతాయి. కానీ, ప్రస్తతం మార్కెట్లో దొరికేవి అన్ని పాలు అని నమ్మలేని పరిస్థితి. ఈ సమస్యను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలును అందించడానికి డెయిరీల్లో అత్యాధునిక పరికరాలను తీసుకురావడానికి ముందడుగు వేసింది. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఆఫ్ అడ్వాన్సడ్ రీసెర్చ్ అండ్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్)లో రూ.11 కోట్లతో స్టేట్-సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ ల్యాబ్ ద్వారా పాలు, పాలే ఉత్పత్తుల విషపూరిత రసాయనాలను గుర్తించి, నివారణ చర్యలు చేప్పట్టనుంది.
గేదె పాలల్లో 5.5 శాతం కొవ్వు. 8.7 శాతం ఎస్ఎన్ ఎఫ్ (ఘన పదార్థాలు), ఆవు పాలల్లో 3.2 శాతం కొవ్వు, 8.3 శాతం ఎస్ఎస్ఎఫ్ ఉంటే మంచి పోషక విలువలు ఉన్న పాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారింది. పాలల్లో పలు రకాల రసాయనాలను కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. నాసిరకం దానాల వాళ్ళ పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరస్థాయిలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కొందరు ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయం పలుమార్లు వెలుగులోకి వచ్చిం ది. ఇటువంటి నాసిరకం, కల్తీ, నకిలీ పాల వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. తద్వారా పాలల్లో నాణ్యతను గుర్తించేందుకు రాజమహేంద్రవరం, జి. కొత్తపల్లి, ఒంగోలు, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో ఆ అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏపీ కార్ల్ లో దేశంలోనే అతి పెద్ద స్టేట్, సెంట్రల్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తుంది.
స్టేట్ సెంట్రల్ ల్యాబ్ 'సేవలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు, పాడి రైతులు, వాటా దారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎగుమతులను పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, భారీ లోహాలు, మైకో టాక్సిన్లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషించి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కల్తీలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి..
రైతుల కు చాట్‌బోట్ సేవలు అందించడానికి కేంద్రం సన్నాహాలు
ఏపీలో కార్ల్ ల్యాబ్ ఏర్పాటు ఇప్పటికే పూర్తికాగా, నేషనల్ అక్రిడిసిషన్ మోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసారు. ఇప్పటి వరకు సాంపిల్స్ని పరిక్షించాలి అంటే కొకటి, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళాసొచ్చేది. ఒక్కో శాంపిల్ కు రూ.2,500 నుండి రూ.30 వేళా వరకు ఖర్చయేది. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చితో ఏడాదికి 500 నుండి 1000 వరకు పరీక్షలు చేయవచ్చు. ఈ ల్యాబ్లో ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, పలు బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనలైజర్, ఎఫ్బీఐ ఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరాలు ఉన్నాయి. సుమారుగా 15 మంది నిపుణులైన సిబ్బందిని నియమిస్తున్నారు. మూడు నీళ్లలో ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments