ఒకప్పుడు పోలానికి నీళ్లు పెట్టాలంటే.. రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రాత్రి, పగలు పోలం దగ్గరే ఉండాల్సి వచ్చేది. కుటుంబం మొత్తం రాత్రి పోలం దగ్గరే గడపాల్సి వచ్చేది. రాత్రిపూట చీకట్లో కనిపించక పోలానికి నీళ్లు పెట్టాలంటే చాలా కష్టమయ్యేది. ఇక మోటార్ ద్వారా నీళ్లు పెట్టాలంటే.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్ కోసం 24 గంటలు పోలం దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చేది.
ఎక్కువగా రాత్రిపూట కరెంట్ ఇచ్చేవారు. దాంతో రాత్రి పోలం దగ్గరే జాగారం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రైతులకు పగటిపూట కరెంట్ ఇస్తున్నారు. కానీ పోలంకు నీళ్లు పెట్టాలంటే రైతులు పోలం దగ్గరే ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రైతులు పోలం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి దగ్గర నుంచే పోలానికి నీళ్లు పెట్టే సరికొత్త టెక్నాలజీ పరికరాలు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి.
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
మీ పోలంలోని మోటార్‌కి ఒక మీటర్ లాంటిది బిగిస్తారు. అందులో మీ ప్రాంతంలో బాగా సిగ్నల్స్ వచ్చే ఒక సిమ్ కార్డును పెట్టాలి. ఆ సిమ్ కార్డు నెంబర్‌కి మీ ఫోన్‌లోని సిమ్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా చేయగానే.. మీ మొబైల్ నెంబర్ మోటార్‌కు బిగించిన సిమ్ కార్డులో రిజిస్టర్ అవుతుంది.
మోటార్ ఆన్ లైదా ఆఫ్ ఎలా చేసుకోవాలి?
రిజిస్టర్ అయిన మొబైర్ నెంబర్ నుంచి మోటార్‌కి బిగించిన సిమ్ కార్డుకు మిస్డ్ కాల్ ఇస్తే ఆన్ అవుతుంది. అలా ఆన్ అవ్వగానే మీ మొబైల్‌కి మెసెజ్ వస్తుంది. ఇక మళ్లీ మిస్డ్ కాల్ ఇస్తే.. మోటార్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అవ్వగానే మీకు మెసేజ్ రూపంలో తెలియచేస్తుంది. ఇక కరెంట్ పోయినా, వచ్చినా మీకు మెసేజ్ వస్తుంది. అలాగే మోటార్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా.. మీకు మెసేజ్ ద్వారా సమాచారం వస్తుంది. మన దేశంలో మీరు ఎక్కడ ఉన్నా... మీ మొబైల్ ద్వారానే మోటార్‌ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు
ఈ పరికరాల ధర ఎంత?
మార్కెట్‌లో చాలా కంపెనీలు ఇలాంటి టెక్నాలజీ గల పరికరాలను తయారుచేస్తున్నాయి. వీటి ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది
Share your comments