దొంగలకు ఉండే తెలివి తేటలు పోలీసులకు కూడా ఉండవు అనే విధముగా కొందరు .. అత్యంత తెలివిగా దొంగలే పోలీసులమని చెప్పి దొంగతనాలు చేసే సంఘటనలు పెరిగిపోతున్నాయి .. పోలీసులమని చెప్పి కొందరు లూటీలకు పాల్పడుతుంటే మరికొందరు ఎవ్వరు ఉహించనివిదంగా ఏకంగా గొర్రెలు, మేకలను ఎత్తుకు పోయిన ఘటన హైదరాబాద్ హైవే జరిగింది .
ఏరుకొని తినేవాని వెంట గీరుకోని తినేవాడు పడినట్లు , నిన్న రాత్రి రాజస్థాన్ నుంచి గొర్రెలు, మేకలను హైదరాబాద్ జియాగూడ మార్కెట్కు తరలిస్తుండగా కొందరు నిందితులు పోలీసులమని చెప్పి కొందరు దుండగులు గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లారు.
అధిక దిగుబడి ఇచ్చే 61 కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసిన PJTSAU
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ జాతీయ రహదారిపై నిన్న రాత్రి రాజస్థాన్ నుంచి గొర్రెలు, మేకలను హైదరాబాద్ జియాగూడ మార్కెట్కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు, రెండు డీసీఎంలు, టెంపో, స్కూటీ వాహనాల్లో వచ్చిన కొందరు దుండగులు తాము పోలీసులమని .. . బెదిరించి 246 గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లారు. లోడు తీసుకెళుతున్న వారిని కొట్టి బెదిరించి తమ వాహనాల్లో ఎక్కించుకుని.. ముత్తంగి రహదారి గుండా వెళ్లిపోయారు. బాధితులను ముత్తంగి బాహ్య వలయ రహదారి కూడలిలో దింపేశారు.
తమను మధ్యలో దింపివేయడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Share your comments