News

ఒక్క నెలలో రెట్టింపైన ఉల్లి ధర.... ఎగుమతి సుంకంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి....

KJ Staff
KJ Staff

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, అయితే తాజాగా పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. గడించిన 15 రోజుల్లో ఉల్లిపాయ ధర 40% ఎగబాకింది, ఈ పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఉల్లి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం గత నెల ఉల్లి ఎగుమతులపై 40% ఎగుమతి సుంకాన్ని విధించింది, అయినా సరే ఉల్లి ధర పెడుతూనే ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఉల్లి ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.

ఉల్లి ఎగుమతులపై 40% సుంకం విధించడం ద్వారా, ఎగుమతులు తగ్గి ఉల్లి ధరలు నియంత్రణలోకి వస్తాయని కేంద్రం యోచించింది. కానీ దీనికి భిన్నంగా పరిస్థితులు మారుతున్నాయి. ఉల్లిని ప్రధానంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం మూలాన పంట దిగుబడి మీద ప్రభావం చూపించింది. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి, హీట్ వేవ్ కారణంగా ఈ రాష్ట్రంలో ఉల్లి సాగు ఘననీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితులన్నీ ఉల్లి ధర పెరుగుదలలో ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొందరు వ్యాపారస్తులు సిండికేటుగా మారి మార్కెట్లో కుత్రిమ ఉల్లి కొరత సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి నెల దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లిని వినియోగిస్తున్నారు. అయితే వేర్వేరు ప్రాంతాల నుండి మార్కెట్కి చేరుకున్నాక, సరైన నిల్వ సామర్ధ్యం లేనందున, కుళ్లిపోయి వృధా అవుతున్నాయి. అంతేకాకుండా నిల్వ సమయంలో ఉల్లిపాయలు బరువులు 30-40 % కోల్పోతాయి. ఈ విధంగా పరిమాణం తగ్గిపోయి, నాణ్యత కూడా క్షిణిస్తుంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ వృధా రూ. 11,000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.

దేశంలో ఉల్లిని ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి, దేశ అవసరాలకు సరిపడా ఉల్లి ఈ రాష్ట్రాల నుండి వస్తుంది. ఈ రాష్ట్రాలన్నీ ఒక్క రబి సీసన్లోనే 65% పంట పంటను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఏప్రిల్ మరియు మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబర్-నవంబర్ వరకు ఉంటుంది. ఇలా వచ్చిన ఉల్లి విదేశాలకు కూడా రవాణా అవుతుంది 2022-23 మధ్య 25 లక్షల టన్నులుగా ఉన్న ఈ ఉల్లి ఎగుమతులు ప్రభుత్వం విడిచిన సుంకంతో 2023-24 సంవత్సరానికి 17 లక్షల టన్నులకు పడిపోయాయి. 2024 ఏప్రిల్ తరువాత ఈ ఎగుమతులు లక్ష టన్నులు మాత్రమే ఉండొచ్చని అంచనా.

Share your comments

Subscribe Magazine

More on News

More