News

కోరమాండల్ , స్టీవార్డ్షిప్ 'safe use responsible use ' ప్రచారం ప్రారంభం!

KJ Staff
KJ Staff

వ్యవసాయ రసాయన ఉత్పత్తులకి సంబంధించి  పరిశోధన & అభివృద్ధి, తయారీవిధానం, నిల్వ, రవాణా, పంపిణీ, మార్కెటింగ్  మరియు అమ్మకాల వంటి విభాగాలలో  స్టీవార్డ్‌షిప్ (బాధ్యత తో కూడిన వినియోగం, సురక్షితమైనది)  . అనే నినాదం తో పనిచేస్తుంది , స్టీవార్డ్‌షిప్ విధానం యొక్క ప్రధాన  లక్ష్యం వ్యవసాయ రసాయనాల వాడకంలో ప్రయోజనాలను పెంచి అదే సమయంలో నష్టాన్ని మరియు ప్రమాదాన్ని తగ్గించడం.

కంపెనీ వ్యవసాయ రసాయనాలు చేసే సమయంలో ప్రతీది  ఖచ్చితమైన నిర్వహణ  లో ఉంటుంది. వ్యవసాయ రసాయనాలు వాడేటప్పుడు వాటాదారులు సరైన జాగ్రత్తలు పాటించాలి, వాటి వాడకంలో అన్ని దశల గురించి అవగాహనా పెంచుకోవాలి.

ప్రభుత్వం కొత్త ఉత్పత్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిబంధనలను కూడా రూపొందించింది, అవి ఈ విధంగా  ఉన్నాయి.

ప్రతి పంటలో వచ్చే  తెగులు మరియు వ్యాధిని ఎదుర్కొనే  సామర్థ్యాన్ని  మరియు భద్రతని పరీక్షించుట, పర్యావరణంపై ఉత్పత్తి యొక్క విష పూరిత ప్రభావం పడకుండా నిర్దారించుట.

వినియోగించేకాలం వరకు సరిగ్గా ప్యాక్ చేయబడింది అని నిర్దారించుట, ఉత్పత్తిని  వినియోగించే సమయంలో తీసుకునే జాగ్రత్తలు మరియు ప్రమాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు  ఎదుర్కోవడానికి తక్షణ చర్యలకి సంబందించిన సమాచారాన్ని  అంత కూడా  కూడా లేబుల్ మరియు కార పత్రాలలో  పొందుపరచటం.

స్టీవార్డ్‌షిప్ అనేది అంతరాజ్జాతీయ కోరమాండల్ కి చాలా ప్రధానం:

అంతరాజ్జాతీయ కోరమాండల్ యొక్క ప్రధాన విలువలలో స్టీవార్డ్‌షిప్ ఒకటి. రైతులు మరియు భాగస్వాములందరూ వ్యవసాయ రసాయన ఉత్పత్తులు సురక్షితంగా ఉపయోగించడం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని కంపెనీ బలంగా నమ్ముతుంది.

 రైతులు చాలా ముఖ్యమైన వాటాదారులని కోరమాండల్ భావిస్తోంది. అందుకొరకు పంట సంరక్షణ ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగం'పై రైతులకు పూర్తి అవగాహన పెంచడానికి దానికి సంబందించిన ప్రచారాన్ని ప్రారంభించింది.

కిసాన్ దివాస్ సందర్భంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు, NK రాజవేలు EVP మరియు  క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ హెడ్ SBU ఈ విధంగా  ప్రసంగించారు స్టీవార్డ్‌షిప్ రైతులతో మరియు వినియోగదారులతో  ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది  ఈ రోజు కోరమాండల్‌లో మనందరికీ చారిత్రాత్మకమైన రోజు, ఈ రోజును పంట రక్షణ ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంపై ప్రచారానికి అంకితం చేస్తాము.

ఈ ప్రచారంలో  కోరమాండల్ వివిధ అంశాలపై బాధ్యతాయుతమైన అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఉత్పత్తి కొనుగోలు నుండి వినియోగం వరకు వాటి పాకేజింగ్  మరియు అప్లికేషన్ సంబందించిన  వివిధ దశలలో పూర్తి  వివరాలు అందిస్తుంది.

వ్యవసాయ రసాయనాలను ఉపయోగిస్తున్నప్పుడుప్రధానంగా మూడు R లను గుర్తుంచుకోవాలి.

పంటలకు సోకిన  వ్యాధులకు నివారించడానికి  వాడే పంట రక్షణ ఉత్పత్తులు  మనం ఉపయోగించే మందులను పోలి ఉంటాయి.

మనం అందరికి  తెలుసు నిపుణుల సూచన మేరకు మందులు సరైన మోతాదులో సరైన  సమయాలలో తీసుకోవాలని, మందులు సురక్షితమైన స్థలంలో మరియు పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలి.

 

మందులకు గడువు తేదీ ఉంటుంది, ఆ తర్వాత అవి అంత ప్రభావవంతంగా ఉండవు మరియు గడువు ముగిసిన తర్వాత వాటిని దూరంగా పారవేయాలి. ఔషధం యొక్క ప్రయోజనాలు  మరియు మోతాదుకు మించి వాడితే  దాని పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని సూచనలు దాని లేబుల్ లో క్లుప్తంగా  వివరించి ఉంటాయి.

వ్యవసాయ రసాయనాలు సులభంగా వాడటానికి ప్రత్యేకమైన విధానం  ఉంది అవి 3 R లు , (RIGHT DOSAGE)సరైన మోతాదు, (RIGHT TIME)సరైన సమయం మరియు (RIGHT METHOD OF APPLICATION) వాడే  సరైన పద్ధతి, సురక్షితంగా  నిల్వ చేయడానికి సరైన అవగాహనా పొంది ఉండాలి.

ఈ సమాచారాన్ని రైతులకి చేరవేయడానికి  దేశవ్యాప్తంగా అనేక రైతు సమావేశాలు నిర్వహించబడ్డాయి. వ్యవసాయ రసాయనాల బాధ్యతాయుత వినియోగంపై  పాటించాల్సిన  ప్రాథమిక  జాగ్రత్తల గురించి  అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులకి సమాచారం ఇవ్వబడింది. ఈ సమావేశాల్లో  ప్రభత్వ రంగ వ్యవసాయ అధికారులు, చిల్లర వ్యాపారులు డీలర్లు పాల్గొన్నారు. కోరమాండల్ ఈ సందేశాన్ని సామజిక మాధ్యమాల ద్వారా కూడా  రైతులకు చేరవేసింది.  కోరమాండల్ ముందుముందు వ్యవసాయ రసాయనాల వినియోగం గురించి అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలను చేపడుతుంది  దాని గురించే ప్రత్యేకంగా స్టీవార్డ్‌షిప్  ఉంది.

వ్యవసాయ చట్టాల రద్దు వద్దు .... సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక!

Share your comments

Subscribe Magazine

More on News

More