News

రెండు శక్తివంతమైన మల్టీ పర్పస్ మోటార్స్ లాంచ్ చేసిన STIHL:

KJ Staff
KJ Staff

వ్యవసాయంతో పాటు అనేక కార్యకలాపాలకు అవసరమయ్యే ఉపకరణాలను తయారుచేయడంలో పేరున్న STIHL కంపెనీ ఇప్పుడు రెండు కొత్త మల్టీ పర్పస్ హై పవర్ ఇంజిన్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. వాటి పూర్తి వివరాల కోసం చివరి వరకు చదవండి.

వేగంగా పురోగతి చెందుతున్న ఆధునిక ఉపకరణాలు మన రోజువారీ పనులన్నిటినీ ఎంతో సులభతరం చేస్తున్నాయి. ఆధునిక ఉపకరణాలు కేవలం మన పనులన్నిటినీ సులభతరం చెయ్యడమే కాకుండా మనం ఆశించిన ఫలితాన్ని అందిస్తున్నాయి. ఇటువంటి ఎన్నో ఆధునిక ఉపకరణాలు నిర్మించడంలో కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్న స్థిల్ కామపీనీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతంచేసుకుంది. జర్మనీకి చెందిన స్థిల్ కంపెనీ ఎన్నో సంవత్సరాల అనుభవంతో జర్మన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయానికి ఉపయోగపడే అనేక ఉపకరణాలను తయారుచేస్తుంది. క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీపడని స్థిల్ ప్రపంచమంతా ఎంతో ప్రశిద్ధి పొందింది. ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి అనేక అవసరాలకు అనుగుణంగా రెండు కొత్త ఇంజిన్స్ విడుదల చేసింది.

మల్టీ పర్పస్ 4- స్ట్రోక్ స్టేషనరీ ఇంజిన్ 12.5 Nm టోర్క్యూ కలిగిన EHC 605 S మరియు 15.6 Nm టోర్క్యూ కలిగిన EHC 705 S ఇంజిన్స్ లాంచ్ చేసింది. వ్యవసాయ పనులకు, కన్స్ట్రక్షన్ మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఈ ఇంజిన్స్ తయారు చేసారు.

STIHL EHC 605 S:

STIHL కామపీనీ విడుదల చేసిన EHC 605 S మల్టీ పర్పస్ ఇంజిన్ 212cc వరకు శక్తిని ఉత్పత్తి చెయ్యగలదు. 4.4KW / 6.0 హార్స్ పవర్ తో వస్తున్న ఈ ఇంజిన్ 4000 ఆర్ప్ఎం వరకు చేరుకోగలదు. ఈ ఇంజిన్ 3.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. EHC 605 S యొక్క మొత్తం బరువు 15.7 కిలోలు. STIHL కంపెనీ ఈ మోడల్ ఇంజిన్ పై రెండు సంవత్సరాలు పూర్తి వారెంటీ ఇస్తుంది.

STIHL EHC 705 S:

STIHL కామపీనీ విడుదల చేసిన EHC 705 S మల్టీ పర్పస్ ఇంజిన్ 252cc వరకు శక్తిని ఉత్పత్తి చెయ్యగలదు. 5.2KW / 7.0 హార్స్ పవర్ తో వస్తున్న ఈ ఇంజిన్ 4000 ఆర్ప్ఎం వరకు చేరుకోగలదు. ఈ ఇంజిన్ 4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. EHC 705 S యొక్క మొత్తం బరువు 17.3 కిలోలు. STIHL కంపెనీ ఈ మోడల్ ఇంజిన్ పై రెండు సంవత్సరాలు పూర్తి వారెంటీ ఇస్తుంది.

ఫ్యూయల్ ఆధా చేసే టెక్నాలజీ:

STIHL ఈ రెండు ఇంజిన్స్ తక్కువ ఇంధనంతో ఎక్కువ పని చేసేలా ఫ్యూయల్ ఎఫిసియెంట్ టెక్నాలజీ ద్వారా నిర్మించారు. దీనితో పాటు EHC 705 S, EHC 605 S రెండు మల్టీ పర్పస్ ఇంజిన్స్ తక్కువ పొగ మరియు ఎక్కువ టోర్క్యూ ఉత్పత్తి చేసేవిధంగా తయారుచేసారు పైగా ఈ ఇంజిన్స్ కు తక్కువ మెయింటనెన్స్ హామీని కూడా ఇస్తున్నారు.

శక్తివంతమైన బహుళప్రయోజనాలు కలిగిన ఇంజిన్:

STIHL కామపీనీ తమ 6 హార్స్ పవర్ మరియు 7 హార్స్ పవర్ బహుళప్రయోజనాలు కలిగిన ఇంజిన్ మోడల్స్ EHC 605 S మరియు EHC 705 S వ్యవసాయంతో పాటు అనేక ఇతర అవసరాల కోసం ఉదాహరణకు రోడ్ కన్స్ట్రక్షన్, రైల్వే, మరియు ఎన్నో ప్రయోజనాలతో నిర్మించారు. ఈ ఇంజిన్స్ వ్యవసాయంలో నీటిని తోడటానికి, వాటర్ స్ప్రేయర్స్ వినియోగానికి ఉపయోగపడతాయి.

మరిన్ని వివరాల కోసం: కింద ఇవ్వబడిన నెంబర్ ద్వారా కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా నేరుగా కామపిణిని సంప్రదించండి: నెంబర్ 9028411222 STIHL కామపీనీ వారి ఇతర వెబ్సైటు ని విసిట్ చేసి ఇతర వివరాలు తెలుసుకోండి: www.stihl.in

Share your comments

Subscribe Magazine

More on News

More