రానున్న కొత్త సంవత్సరంతో కరోనా వైరస్ దేశ వ్యాప్తముగా విజృంభించి దాదాపు నాలుగు ఏళ్ళు కావస్తుంది .. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఇంట్లో నుంచి రావడానికి భయపడే వారు , తొలి దశలో అది పుట్టించిన భయం మాత్రం అంతఇంత కాదు , అ భయం తాలూకు వింత ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము గత ఏడాది కరొనకు బయపడి ఒక కుటుంబమే 3 సంవత్సరాలుగా బయటికి రాకుండా ఉండిపోయారు .. ఇప్పుడు దానికి మించి కరోనా భయం తో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు ఇంట్లోనే ఉండిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది .
ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలం కుయ్యరు గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి తల్లీ, కూతుళ్లు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సమయంలో బయటికి రాకూడదు అని తల్లి మణి, కూతురు దుర్గాభవాని భయాన్ని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంట్లో ఒక హాల్‌లోనే తల్లీకూతుర్లు ఉండిపోయారు. తండ్రి అప్పుడప్పుడు భోజనం ఇచ్చేవారు. బయటకు వస్తే కరోనా వస్తుంది అనే భయంతో తల్లీకూతుర్లు వణికిపోతున్నారు. దుప్పటి కప్పుకుని అందులోనే ఉండిపోయారు. కిటికీలోంచి ఎవరు మాట్లాడినా కూతురు దుప్పటి లోపలే ఉండి సమాధానం చెబుతోంది.
తాజ్ మహల్‌పై రూ. 1.47 లక్షల ఇంటి పన్ను .. నోటీసులు జారీ చేసిన ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్!
విషయం తెలిసిన వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. తల్లి కూతుర్ని చూసి సుమారు రెండు సంవత్సరాల అయ్యుంటుందని స్థానికులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి తండ్రిని కూడా ఇద్దరూ ఇంటి లోపలికి రానివ్వని పరిస్థితి. ఈ క్రమంలో తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్య సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అందుకు తల్లీకూతుళ్లు నిరాకరిస్తున్నారు.
కరోనా వ్యాపిస్తున్న మొదటి క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తికి గురించి ఏర్పడిన భయమే దీనికి కారణమని వైద్యులు తెలుపుతున్నారు .
Share your comments